గుడివాడలో ఘోరం.. తూటా తగిలి బాలుడి మృతి - MicTv.in - Telugu News
mictv telugu

గుడివాడలో ఘోరం.. తూటా తగిలి బాలుడి మృతి

December 8, 2018

ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా గుడివాడ గ్రామీణ మండలంలో విషాదం చోటుచేసుకుంది. పక్షులను చంపడానికి పేల్చిన తూటా తగిలి ఓ బాలుడు ప్రాణాలు విడిచాడు. శేరిదింటకుర్రు గ్రామంలో శనివారం ఉదయం ఈ సంఘటన జరిగింది. కొందరు వ్యక్తులు చేపల చెరువుపై నాటు తుపాకీతో పక్షులను వేటాడుతుండగా తూటా గురితప్పి కరుణానిధి(14) అనే బాలుడు తలలోకి దూసుకెళ్లింది. బాలుడు అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితులను అరెస్ట్ చేశారు.

tt