బీపీ, షుగర్ ఎమ్మెల్యేలకు అసెంబ్లీలో మధ్యాహ్నభోజనం - MicTv.in - Telugu News
mictv telugu

బీపీ, షుగర్ ఎమ్మెల్యేలకు అసెంబ్లీలో మధ్యాహ్నభోజనం

March 10, 2018

గుజరాత్ అసెంబ్లీ స్పీకర్ రాజేంద్ర త్రివేది ప్రజా ప్రతినిధుల కోసం ఓ తీపి కబురు చెప్పారు. అసెంబ్లీ సమావేశాల్లో బీపీ, షుగర్ వ్యాధులతో పాల్గొనే ఎమ్మెల్యేల సౌకర్యార్థం స్పీకర్ సమావేశ వేళల్లో మార్పులు చేశారు. మధ్యాహ్న బోజన సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఔషధాల వినియోగం, ఆహార నియమాలను దృష్టిలో పెట్టుకుని  ఎమ్మెల్యేలందరికీ మధ్యాహ్న భోజనాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నట్లు ఆయన చెప్పారు. చక్కెర వ్యాధిబారిన పడినవారు తమకు అనువైన ఆహారాన్ని ఏర్పాటు చేసుకోవచ్చిన తెలిపారు. ఈ నిర్ణయంతో సమావేశాల వేళల్లో మార్పు వచ్చింది. ఇంతకుముందు ఉదయం 8.30 గంటలకు సభా కార్యకలాపాలు మొదలవుతున్న సంగతి తెలిసిందే. కొత్త మార్పుల ప్రకారం, ఇకపై ఉదయపు సెషన్లు ఉన్నప్పుడు సభ ఉదయం 9.30 గంటలకు ప్రారంభమవుతుంది.ఇక వేరే రోజుల్లో సమావేశాల సమయాన్ని సడలించారు. సెషన్లు మధ్యాహ్నం కాకుండా ఉదయం 11.00 గంటలకే మొదలవుతాయన్నారు. సభకు హాజరయ్యే 182 మంది సభ్యుల్లో 40 మందికి పైగా షుగర్, బీపీలతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నట్టు తెలుస్తోంది.