బ్రహ్మచర్యం పోగొట్టాలని, చెట్టుకు వాటిని కట్టేసి.. - MicTv.in - Telugu News
mictv telugu

బ్రహ్మచర్యం పోగొట్టాలని, చెట్టుకు వాటిని కట్టేసి..

February 15, 2018

మనిషికో వింత చెట్టుకో చింత  అన్నట్టే వుంది ఢిల్లీలోని ఈ కాలేజీ యవ్వారం చూస్తుంటే.. దేశ రాజధాని ఢిల్లీ నగరంలోని హిందూ కాలేజీ విద్యార్థులు వాలైంటైన్స్ డేను పురస్కరించుకొని విభిన్నంగా చెట్టుకు పూజ చేశారు. ఇది ప్రతీ ఏటా ప్రేమికుల రోజునాడు తప్పకుండా చేస్తారట. ఇందులో వింతేంటని ఆశ్చర్యపోకండి.. వారికిలా చేస్తేనే ప్రేమికుల రోజు జరుపుకున్నట్టు అనిపిస్తుందట.ఇందుకోసం వారంతా కాలేజీ ఆవరణలో ఉన్న అతి పురాతన వృక్ష్యాన్ని అందంగా ముస్తాబు చేస్తారు. దానిని శృంగార దేవత వృక్షంగా  కొలుస్తారు. ఆ వృక్ష్యానికి రంగు రంగుల బెలూన్లు, నీటితో నింపిన కండోమ్స్ కడుతారు. అంతేకాకుండా ఆ చెట్టుకు సినీ తారల ఫొటోలు, పోస్టర్లను అలకరించి పూజలు చేస్తారు. ఆ వృక్షానికి ‘ దమ్‌దామి మాయి ’ అని పిలుస్తారు.శృంగార దేవతగా ఓ సినీతారను ఎంచుకుంటారు. అలా ఈసారి బాలీవుడ్ భామ జాక్విలిన్ ఫెర్నాండెజ్‌ను, లవ్‌గురుగా రణ్‌వీర్ సింగ్‌ను ఎంచుకుని పూజ నిర్వహించారు. హిందూ కాలేజీ హాస్టల్ అధ్యక్షుడు లలిత్ కుమార్ మాట్లాడుతూ.. ప్రతీ ఏటా దమ్‌దామి మాయి వ‌ృక్షాన్ని ఎందుకు ఎంచుకుటామంటే.. ఆ చెట్టును పూజిస్తే తమ బ్యాచ్‌లర్ (బ్రహ్మచర్యం) లైఫ్ ముగిసి పోతుందని, శృంగారాన్ని రుచిచూస్తామని విద్యార్థులు బలంగా నమ్ముతారు. అందుకే ప్రతీ ఏటా ఆ చెట్టును పూజిస్తాం అని తెలిపారు. ‘దమ్‌దామికి జై హో ’ అంటూ నినాదాలు చేస్తూ పూజారితో కలిసి విద్యార్థులందరూ దమ్‌దామి మాయ వృక్షం వద్దకు చేరుకొంటారు. కండోమ్‌లో నింపిన నీటిని పవిత్రంగా భావించి సేవిస్తారు.