ఒక చేతిలో కొడుకు.. మరో చేత్తో ధన్ ధన్... - MicTv.in - Telugu News
mictv telugu

ఒక చేతిలో కొడుకు.. మరో చేత్తో ధన్ ధన్…

November 21, 2017

ఆ పోలీసు  అధికారి సెలవుల్లో ఉన్నారు. అయిన కూడా తన కర్తవ్యాన్ని మరMRపోలేదు.  ఓ చేతిలో నెలల వయస్సు ఉన్న తన కొడుకుని ఎత్తుకుని, మరో చెత్తో దొంగలపై కాల్పులు జరుపుతూ వారి  ఆట కట్టించాడు. బ్రెజిల్‌కు చెందిన సర్జియెంట్ రాఫెల్ సౌజా మిలిటరీ పోలీసు అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు.

ఇటీవల ఆయన విధుల నుంచి సెలవులను తీసుకుని భార్య, నెలల బాబుతో కలసి స్థానిక మందుల దుకాణానికి వెళ్లారు. ఆ సమయంలో దుకాణంలోకి  ఇద్దరు దుండగులు చోరీకి  వచ్చారు. తుపాకులు పట్టుకుని  అక్కడ ఉన్న వారిని బెదిరించి, దోపిడికి ప్రయత్నించారు. వెంటనే అప్రమత్తమైన సౌజా తన దగ్గర ఉన్న తుపాకీ తీసి  దుండగులపై కాల్పులు జరిపారు.

ఓ చేత్తో బాబును  ఎత్తుకుని, మరో చేత్తో దొంగను కాల్చాడు. తర్వాత తన కుమారుడిని భార్యకు ఇచ్చి, మరో దుండగుడి మట్టుబెట్టాడు. ఈ ఘటనలో ఇద్దరు దుండగులు హతమయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. బాధ్యతాయుతంగా వ్యవహరించిన  పోలీసును నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.