బ్రిటన్ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 8 మంది భారతీయులు మృత్యువాత పడ్డారు. బ్రిటన్ లో గత 24 ఏళ్లలో జరిగిన ఘోర ప్రమాదం ఇదేనట. శనివారం ఉదయం బకింగ్ హామ్ షైర్ లోని న్యూపోర్ట్ పగ్నెల్లి లో విప్రో ఐటీ ఉద్యోగులను తీసుకెళ్తున్న మినీ బస్సును రెండు లారీలు ఢీకొన్నాయి. ప్రమాదంలో ముగ్గురు మహిళలు సహా 8 మంది భారతీయులు అక్కడికక్కడే చనిపోయారు.
పోలీసులు లారీ డ్రైవర్లను అరెస్ట్ చేసి కేసు పెట్టారు. వీరు నిర్ణీత వేగానికి మించి వాహనాలు నడపడం వల్లే ప్రమాదం జరిగిందన్నారు. విప్రో మృతులను కార్తికేయన్, రామసుబ్రమణియం పుగలూర్, రుషి కుమార్, వివేక్ భాస్కరన్ లా గుర్తించారు. మనోరంజన్ పన్నీర్ సెల్వం అనే మరో విప్రో ఉద్యోగి తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నాడు.