హమ్మయ్య.. ప్రిన్స్ హ్యారీ పెళ్లి కుదిరింది..! - MicTv.in - Telugu News
mictv telugu

హమ్మయ్య.. ప్రిన్స్ హ్యారీ పెళ్లి కుదిరింది..!

November 27, 2017

బ్రిటన్ యువరాజు హ్యారీ.. అమెరికన్ నటి మేఘన్ మార్కెల్‌ ను వచ్చే ఏడాది వివాహం చేసుకోనున్నాడు. వీరి నిశ్చితార్థం గత నెల జరిగింది. ఈ విషయాన్ని ప్రిన్స్  హ్యారీ తడ్రి ప్రిన్స్ చార్లెస్ సోమవారం అధికారికంగా ప్రకటించారు. మేఘన్ తల్లిదండ్రులతో మాట్లాడామని, వారి అంగీకారంతో  పెళ్లి తేదీ కుదుర్చామని తెలిపారు.. వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్‌లో వీరి పెళ్లి జరగనుంది.  

మేఘన్ కు ఇది రెండో పెళ్లి. ఆమె  నిర్మాణ ట్రెవర్ ఇంగెల్సన్‌తో  తన మూడెళ్ల పెళ్లి బంధం తర్వాత విడాకులు తీసుకుంది. మేఘన్, హ్యారీ పెళ్లి వార్తతో వీరి సంబంధంపై వస్తున్న ఊహాగానాలకు తెరపడింది. వీరు టైమ్ పాస్ చేస్తున్నారని, పెళ్లి చేసుకునే రకం కాదని విమర్శలు వచ్చాయి. చివరకు బ్రిటన్ రాణికి కూడా వీరి అనుబంధం నచ్చలేదని వార్తలు వచ్చాయి.

మేఘన్ మార్కెల్(36), ఫ్రిన్స్ హ్యారీ (33) ‘సూట్స్ ’ చిత్రీకరణ సమయంలో టోరంటోలో తొలిసారి కలుసుకున్నారు. అక్కడి నుంచి ఈ వీరువురూ  తరుచూ కలుసుకునేవారు. స్నేహమే ప్రేమగా మారిపోయింది.  మేఘన్‌తో  డేటింగ్ చేస్తున్నానని, తాము చాలా సంతో షంగా ఉన్నామని బహిరంగానే చెప్పాడు. అప్పటి నుంచి మేఘన్ భలే ఫేమస్  అయింది. 2016లో మోస్ట్  సెర్చ్‌డ్  నటిగా మారింది. ఈ మధ్యనే మేఘన్ కూడా తమ ప్రేమ గురించి విప్పింది.