ఆంగ్లేయులు కూడా నల్లవాళ్లకే పుట్టారు..! - MicTv.in - Telugu News
mictv telugu

ఆంగ్లేయులు కూడా నల్లవాళ్లకే పుట్టారు..!

February 7, 2018

శ్వేతజాతి అనే అహంకారంతో ఆంగ్లేయులు ప్రపంచవ్యాప్తంగా చేసిన దారుణాలకు లెక్కలేదు.  నల్ల జాతీయులపై అంత తీవ్ర వివక్షను చూపే తెల్లవాళ్ల శరీరరంగు నిజానికి తెలుపు కాదని కాదంటున్నారు శాస్త్రవేత్తలు.  వారి పూర్వీకులు నల్లవారేనని, కాలక్రమంలో మార్పులతో నలుపు తోలు తెల్ల తోలుగా మారిందని తేల్చేశారు.

తొలితరం ఆంగ్లేయులు  నల్లగానే ఉండేవారని,, ఉంగరాల జుట్టు, నీలి కళ్లు ఉండేవని  డీఎన్ఏ పరీక్షల ద్వారా నిరూపితమైంది. నేచురల్‌ హిస్టరీ మ్యూజియం, యూనివర్సిటీ కాలేజ్‌ లండన్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ టామ్‌‌బూత్‌ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. 1903లో సోమర్పెట్‌లోని చెద్దర్‌లో లభించిన కళేబరం మీద పరీక్షలు నిర్వహించి ఈ  విషయాన్ని నిగ్గుదేల్చారు.  

ఆ కళేబరం ఎముకలపై తొలిసారిగా నిర్వహించిన అత్యాధునిక జన్యు పరీక్షలు, ఫేషియల్‌ రీకన్‌స్ట్రక్షన్‌ టెక్నిక్స్‌ ద్వారా ఎన్నో విషయాలు వెలుగుచూశాయి.  తాము పరిశీలించిన మానవ కళేబరం జీవించి ఉంటే సదరు వ్యక్తి నల్లవాడే  అని స్పష్టం చేశారు. ఆంగ్లేయులు శ్వేతజాతీయులు కాదని, కాలక్రమేణా వారి చర్మం రంగు మారి వుంటుందని తమ పరిశోధనలో తేలినట్టు వారు పేర్కొన్నారు.