చీపుర్లు  పట్టిన  సీఎం,మంత్రులు..! - MicTv.in - Telugu News
mictv telugu

చీపుర్లు  పట్టిన  సీఎం,మంత్రులు..!

September 15, 2017

ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపు మేరకు శుక్రవారం నుంచి దేశవ్యాప్తంగా స్వచ్ఛత కార్యక్రమాన్ని ప్రారంభించారు. ‘ క్లీన్‌ ఇండియా మిషన్‌ ’ ను ప్రారంభించి మూడేళ్లు కావస్తున్న సందర్భంగా ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ చీపురు పట్టారు. ‘ స్వచ్ఛత హై సేవ ’ పారిశుద్ధ్య ప్రచార కార్యక్రమంలో భాగంగా రద్దీగా ఉండే క్రాఫోర్డ్‌ మార్కెట్‌లో చీపురు పట్టి ఆ ప్రాంతాన్ని శుభ్రం చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఆయన తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా విడుదల చేశారు. సీఎం ఫడ్నవీస్‌తో పాటు మంత్రులు సుభాష్‌ దేశాయ్‌, ఎమ్మెల్యే రాజ్‌ పురోహిత్‌, బృహన్‌ ముంబయి మున్సిపల్‌ కార్పోరేషన్‌ కమీషనర్‌ (బీఎంసీ) అజయ్‌ మెహతాతో పాటు అనేక మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎం ఫడ్నవీస్ వీధుల్లో ,మరో వైపు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ దేశ రాజధాని ఢిల్లీలో స్వచ్ఛత కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఐటీబీపీ జవాన్లతో కలిసి చీపురు పట్టిన రాజ్‌నాథ్‌ పరిసర ప్రాంతాలను శుభ్రపరిచారు. ప్రజలందరూ ప్రభుత్వంతో చేతులు కలిపి పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని ఈ సందర్భంగా కేంద్రమంత్రి పిలుపునిచ్చారు.