బామ్మర్ది బావ బతుకు కోరతాడంటారు..కానీ ఈ బామ్మర్ధి ! - MicTv.in - Telugu News
mictv telugu

బామ్మర్ది బావ బతుకు కోరతాడంటారు..కానీ ఈ బామ్మర్ధి !

February 10, 2018

బామ్మర్ధి బావ బతుకు కోరతాడని అంటారు. కానీ ఇక్కడ ఓ బామ్మర్ధి  బావ బతికితే నాకు బతుకులేదని ఆలోచించాడు. బావ చస్తేనే నాకష్టాలు తీరుతాయని అనుకున్నాడు. అక్క బొట్టును చెరిపేసేందుకు దోస్తులతో కలిసి హత్యకు ప్లాన్ వేశాడు. ఇందులో ఇంకో ట్విస్ట్ ఏందంటే…భర్తను చంపమని స్వయాన ఆ నీచుడి అక్కే పురమాయించింది.గుంటూరు జిల్లా సత్తెన్నపల్లికి సమీపంలోని గంగిరెడ్డిపాలెంలో బుజ్జిబాబు, అతని భార్య ఆదిలక్ష్మి నివాసం ఉంటున్నారు. అయితే భార్య ఆదిలక్ష్మికి ఆ గ్రామంలోని నాగేశ్వరావ్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఉంది. వారి అక్రమ సంబంధానికి భర్త అడ్డు తొలగించుకోవాలనుకుంది ఆదిలక్ష్మి. ప్రియుడు నాగేశ్వరావ్ మరియు తమ్ముడు సుబ్బారావ్‌తో కలిసి ప్లాన్ వేశారు. అయితే ఈక్రమంలో నాగేశ్వర్ రావ్ ఆదిలక్ష్మి తమ్ముడికి ఓ ఆఫర్ ఇచ్చాడు. నువ్ మీ బావను చంపితే..నాదగ్గర తీసుకున్న బాకీ రూ.3 లక్షలు మాఫీ చేస్తానని చెప్పాడు. బావను చంపితే అన్ని కష్టాలు తీరిపోతాయని ఆలోచించిన  ఆ బామ్మర్ధి..దోస్తులతో కలిసి బావను  నిర్మానుష ప్రదేశానికి తీసుకెళ్లి బావకు ఫుల్లుగా తాగించి, బండరాయితో తలపై మోది చంపాడు. అయితే పొలాల్లో దొరికిన బాడీ ఆధారంగా బుజ్జిబాబుగా  గుర్తించిన పోలీసులు మొదట గుర్తు తెలియని వ్యక్తులు చంపారేమో అనుకున్నారు. కానీ దర్యాప్తు ముమ్మరం చేయగా భార్య, ఆమె ప్రియుడు నాగేశ్వరావ్ ఆమె తమ్ముడు సుబ్బారావ్ లే పథకం వేసి బుజ్జిబాబును హత్య చేశారని పోలీసుల నిర్ధారణలో తేలింది. దీనితో పోలీసులు బామ్మర్దితో పాటు హత్యలో పాల్గొన్న నిందితులను అరెస్ట్ చేశారు. ఈవిధంగా అక్రమ సంబంధం మోజులో ఓ భార్య, డబ్బులపై ఆశతో ఓ బామ్మర్ధి  ఇంతటి అఘాత్యానికి ఒడిగట్టారు.