పరాయి మతాలపై ఆంక్షలు, నిషేధాలు ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికీ అమల్లో ఉన్నాయి. కారణాలు ఏవైనా అమాయక మైనారిటీ ప్రజలు వీటితో ఇబ్బందులు పడుతుంటారు. క్రైస్తవుల మహా పర్వదినం క్రిస్మస్ సంబరాలు పాశ్చాత్య దేశాల్లో అంగరంగ వైభవంగా జరుగుతుంటాయి. అయితే కొన్ని తూర్పు దేశాల్లో, ముఖ్యంగా ఇస్లామిక్, కమ్యూనిస్టు దేశాల్లో మటుకు అవి నిషిద్ధం. క్రిస్మస్ వేడుక సన్నద్ధమవుతున్న క్రైస్తవులు ఈసారైనా ఆంక్షలను తొలగిస్తారని ఆశతో ఎదురుచూస్తున్నారు.
ఆంక్షలు, నిషేధాలు..
తమ దేశంలో క్రైస్తవుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోందని మండిపుతున్న బ్రూనై బహిరంగ ప్రదేశాల్లో క్రిస్మస్ వేడుకలపై మూడేళ్ల కిందటే వేటు వేసింది. నిబంధలను ఉల్లంఘిస్తే గరిష్టంగా ఐదేళ్ల జైలు శిక్ష, 20 వేల డాలర్ల జరిమానా పడుతుంది. క్రైస్తవులు, ఇతర మతస్తులు కావాలంటే ప్రైవేటుగా వేడుకలు చేసుకోవచ్చట. ముస్లిం మతపెద్దల బలవంతంలో బహిరంగ వేడుకలపై నిషేధం విధించారని చెబుతుంటారు. శాంటాక్లాజ్ టోపీలు, క్రిస్మస్ ట్రీలు, స్టార్లు వంటి క్రిస్మస్ సరంజామాను అంగళ బయట ప్రదర్శించకుండా అధికారులు చర్యలు తీసుకుంటుంటారు. తజకిస్తాన్లోనూ క్రిస్మస్ సరంజామా అమ్మకాలపై ఆంక్షలు ఉన్నాయి. సౌదీ అరేబియా, చైనా, ఉత్తరకొరియా, సోమాలియా వంటి దేశాల్లో వేడుకలపై ఆంక్షలు, పరిమితులు అమలు చేస్తుంటారు.
Telugu news Brunei and other Islamic, communist countries bans Christmas Sultan warns those celebrating could face up to five years in jail in Brunei