బీఎస్ఎన్ఎల్ కొత్త ఆఫర్లు - MicTv.in - Telugu News
mictv telugu

బీఎస్ఎన్ఎల్ కొత్త ఆఫర్లు

March 31, 2018

ప్రభుత్వ టెలికం రంగ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ పోటీలో నిలబడటానికి విశ్వ ప్రయత్నాలే చేస్తున్నట్టు కనబడుతోంది. జియోకు పోటీగా   రూ.118 రీచార్జ్‌తో కొత్త స్పెషల్ టారిఫ్ వోచర్ (ఎస్‌టీవీ) ప్రీపెయిడ్ ప్లాన్‌ను తీసుకు వచ్చింది. ఇప్పటికే రూ. 98తో జియో ఆఫర్ అందిస్తుండగా.. దానికి పోటీగా బీఎస్‌ఎన్‌ఎల్‌ ఈ సరికొత్త ఆఫర్‌ను తీసుకొచ్చింది. 28 రోజుల కాల పరిమితిపై ఈ ఆఫర్‌ను అందిస్తోంది. ఈ ప్లాన్ కింద బీఎస్ఎన్ కస్టమర్లు 1జీబీ, 3జీ, 4జీ డేటాతో పాటు నేషనల్ రోమింగ్ సహా అన్‌లిమిటెడ్ కాల్స్‌ను పొందవచ్చు. ఈ ప్యాక్‌ను ఎవరైతే రీచార్జ్ చేసుకుంటారో వారికి అదనంగా పర్సలైజైడ్ రింగ్ బ్యాక్ టోన్ (పీఆర్‌బీటీ)ను ఉచితంగా పొందవచ్చు. అయితే ఈ సదుపాయం తమిళనాడులో మాత్రమే వర్తిస్తుందని తెలిపింది.ఇదిలావుండగా ఇంకా తన సేవలను మరింత విస్తృతం చేస్తూ.. 5వేల వైఫై హట్‌స్పాట్‌ల సౌకర్యాన్ని ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే బీఎస్ఎన్ఎల్ బిడ్స్‌ను కూడా ఆహ్వానించింది. ఛత్తీస్‌గఢ్, కోల్‌కతా, పశ్చిమ బెంగాల్,  కేరళ, అండమాన్ నికోబార్ దీవులు, మధ్యప్రదేశ్, అసోం, ఈశాన్య1-11 జోన్లతో కలిపి మొత్తం నాలుగు జోన్లలో హాట్‌స్పాట్‌ల ఏర్పాటుకు కృషి చేస్తోంది.

అలాగే రూ. 379, రూ. 551తో ప్రీపెయిడ్‌ ఆఫర్లు కూడా బీఎస్ఎన్ఎల్ ప్రకటించింది. రూ. 379తో రీఛార్జ్‌ చేసుకుంటే రోజుకు 4జీబీ 3జీ/4జీ డేటా 30రోజుల పాటు వస్తుంది.