వచ్చే ఏడాది 5జీ సేవలతో బీఎస్ఎన్ఎల్ - MicTv.in - Telugu News
mictv telugu

వచ్చే ఏడాది 5జీ సేవలతో బీఎస్ఎన్ఎల్

March 21, 2018

ప్రభుత్వరంగ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ తన వినియోగదారులకు ఓ శుభవార్తను తీసుకొచ్చింది. వచ్చే ఏడాది నుంచి 5జీ సేవలను దేశ వ్యాప్తంగా ప్రారంభించనున్నట్లు ఆ సంస్థ ఛైర్మన్ అనుపమ్ శ్రీవాస్తవ తెలిపారు. ఇప్పటివరకు  దేశంలో బీఎస్‌ఎన్‌ఎల్‌కి 3జీ సేవలు మాత్రమే ఉన్నాయి. ఈ ఏడాది చివరినాటికి ఢిల్లీ, ముంబైలను మినహాయించి దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ 4జీ సేవలను ప్రారంభిస్తామన్నారు.5జీ కోసం ఒక లక్ష వరకు వైఫై హాట్ స్పాట్లను ఏర్పాటు చేసి సంస్థ యొక్క రెవెన్యూ రూ.200-250 కోట్ల వరకు లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఈ  సేవలకోసం ఎన్‌టీటీ, నోకియా, జడ్‌టీఈ వంటి సంస్థలతో ఇప్పటికే ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు పేర్కొన్నారు.