బడ్జెట్.. ఏఏ రంగానికి ఎన్నికోట్లు? - MicTv.in - Telugu News
mictv telugu

బడ్జెట్.. ఏఏ రంగానికి ఎన్నికోట్లు?

February 1, 2018

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ 2018-19 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన సాధారణ బడ్జెట్‌ చాలా వర్గాల్లో నిరాశ మిగిల్చింది. ధరల పోటు, నోట్లరద్దు వంటి సమస్యలతో అల్లాడుతున్న ప్రజలకు ఉపశమనం కల్పించలేకపోయింది  రూ. 24లక్షల కోట్ల అంచనాతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టగా మూలధన వ్యయం రూ.7, 78, 712 కోట్లుగా నిర్ణయించారు. ప్రవేశ పెట్టిన బడ్జెట్‌‌లో వ్యవసాయరంగానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు  జైట్లీ. వ్యవసాయ రుణాలను రూ.11లక్షల కోట్లకు పెంచుతున్నట్లు ప్రకటించారు. అధిక దిగుబడులతో రైతులు లాభాల్లో వుండాలి.. వ్యవసాయ ఉత్పత్తులు పెరిగి వ్యవసాయ రంగం లాభసాటి వృత్తి కావాలని జైట్లీ ఆకాంక్షించారు. వివిధ రంగాలకే గాకుండా పలు సంక్షేమ పథకాలకు కూాడా బడ్జెట్లో నిధులు కేటాయించామని పేర్కొన్నారు.

 కేంద్ర బడ్జెట్ అంచనా రూ. 24 లక్షల కోట్లు

కేంద్ర ప్రభుత్వ పథకాలు, ప్రాజెక్టులకు రూ. 7,8,934 కోట్లు

మూలధన వ్యయం రూ. 7, 78, 712 కోట్లు

ఇతర వ్యయాలు, వడ్డీ చెల్లింపులకు రూ.5,75,975 కోట్లు

 కేంద్ర బడ్జెట్ కేటాయింపులు ఇలా :

 • విద్య, ఆరోగ్య, సంక్షేమానికి రూ. 1.38 లక్షల కోట్లు
 • వ్యవసాయ మార్కెట్ల అభివృద్ధి రూ.2 వేల కోట్లు (  కార్పస్ ఫండ్‌తో )
 • ఎస్టీల సంక్షేమం కొరకు రూ. 39,135 కోట్లు
 • ఇంటింటికీ తాగునీటి పథకం కొరకు రూ. 77,500 కోట్లు
 • రైల్వే అభివృద్ధి కొరకు రూ. 1.48 లక్షల కోట్లు
 • ఈ ఆర్థిక సంవత్సరంలో ముద్రా రుణాలు రూ. 3 వేల కోట్లు
 • గంగా ప్రక్షాళనకై రూ. 16,700 కోట్లు
 • చేనేత, జౌళి రంగాల అభివృద్ధి కొరకు రూ. 7,500 కోట్లు
 • రోడ్లు, మౌలిక వసతులకు రూ. 9.64 లక్షల కోట్లు
 • నీటి వసతి లేని 96 జిల్లాల కొరకు ప్రత్యేక నిధి ఏర్పాటు
 • ఆహార శుద్ధి రంగానికి రూ. 1400 కోట్లు
 • 99 నగరాల ఆధునీకరణకు ( ఆకర్షణీయ నగరాల పేర ) రూ. 2.04 లక్షల కోట్లు
 • గ్రామీణ పారిశుద్ధ్య పథకానికి రూ. 16,713 కోట్లు
 • గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కొరకు రూ.14.34 లక్షల కోట్లు
 • చిన్న, సూక్ష్మ తరహా పరిశ్రమల కొరకు రూ. 3,790 కోట్లు
 • వ్యవసాయ రుణాలకు రూ. 11 లక్షల కోట్లు
 • వెల్‌నెస్ సెంటర్ల ఏర్పాటు కొరకు రూ. 1200 కోట్లు
 • వెదురు పరిశ్రమ ప్రోత్సాహానికై రూ. 1290 కోట్లు
 • టెక్స్‌టైల్ రంగానికి రూ. 7,140 కోట్లు
 • జాతీయ జీవనోపాధి మిషన్ కొరకు రూ. 5,750 కోట్లు
 • గ్రామీణ పారిశుద్ధ్య పథకానికి రూ. 16,713 కోట్లు
 • టీబీ రోగుల సంక్షేమం కొరకు రూ. 600 కోట్లు
 • ఎస్సీల సంక్షేమార్థం రూ. 56,619 కోట్లు
 • ఆపరేషన్ గ్రీన్ కొరకు రూ. 500 కోట్లు
 • మహిళా సంఘాలకు 2019 నాటికి రూ. 75 వేల కోట్ల రుణాలు