బెంగుళూరులో  కూలిన ఐదంతస్థుల భవనం.. - MicTv.in - Telugu News
mictv telugu

బెంగుళూరులో  కూలిన ఐదంతస్థుల భవనం..

February 15, 2018

బెంగుళూరులో కట్టడంలో ఉన్న ఓ ఐదంస్థుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. దీనితో శిథిలాల క్రింద చాలామంది చిక్కుకు పోయారు. బెంగుళూరులోని సార్జాపూర్ రోడ్డులో ఈ ప్రమాదం సంభవించింది. ఇప్పటికే ముగ్గురు చనిపోయినట్టు అధికారులు చెబుతున్నారు. ఇంకా శిథిలాల క్రింద చాలామంది చిక్కుకున్నట్లు తెలుస్తోంది. అగ్నిమాపక దళం, ఎన్డీఆర్‌ఎఫ్‌ సహాయక కార్యక్రమాలు కొనసాగిస్తున్నాయి. శిథిలాలను తొలగించుకుంటూ గాయపడ్డవారిని దగ్గరలో ఉన్న దవాఖానాలో చేర్పిస్తున్నారు. బిల్డింగ్ కూలటానికి గల కారణాలు ఇంకా తెలియలేదు. దీని గురించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అంత పెద్ద బిల్డింగ్ ఒక్కసారిగా కూలడంతో చుట్టుప్రక్కలున్న ప్రజలు ఉలిక్కిపడ్డారు.