హేమమాలిని వైపు దూసుకువచ్చిన ఎద్దు - MicTv.in - Telugu News
mictv telugu

హేమమాలిని వైపు దూసుకువచ్చిన ఎద్దు

November 2, 2017

ఎంపీ హేమామాలినికి అనుకోని సంఘటన ఎదురైంది. ఉత్తరప్రదేశ్‌లోని మథుర రైల్వేస్టేషన్‌ను తనిఖీ చేయడానికి వెళ్లిన హేమమాలిని పైకి ఆకస్మికంగా ఓ ఎద్దు దూసుకువచ్చింది. రైల్వే ప్లాట్‌ఫామ్‌లను పరిశీలిస్తున్న సమయంలో, గందరగోళంగా ఓ ఎద్దు హేమామాలిని వైపు వెళ్ల సాగింది.

కొందరు ఆపడానికి ప్రయత్నం చేసినా అది ఆగలేదు. హేమమాలిని చుట్టూ పోలీసులు, ఇతర వ్యక్తులు రక్షణగా నిలిచారు. ఈసంఘటనలో ఎవరీ ఎలాంటి గాయాలు కాలేవు. అయితే దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.