బుల్లెట్ రైలు.. కనీస టికెట్ రూ. 250 - MicTv.in - Telugu News
mictv telugu

బుల్లెట్ రైలు.. కనీస టికెట్ రూ. 250

April 14, 2018

ముంబై-అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ రైలును ప్రారంభించడానికి రంగం సిద్ధమవుతోంది. ఈ రైలు టికెట్ ధరలు కనిష్టంగా రూ. 250 నుంచి గరిష్టంగా 3000 వరకు  ఉంటాయని నేషనల్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ అచల్‌ఖరే తెలిపారు. బిజినెస్ క్లాస్ టికెట్ ధర రూ. 3000 కంటే ఎక్కువగా ఉంటుందని తెలిపారు. ‘ఈ రైలులో మొత్తం పది బోగీలు ఉంటాయి. ఇందులో ఒకటి బిజినెస్ తరగతి. వీరికి ఉచిత భోజన సదుసాయం  కల్పిస్తాం. ఈ ధరలను ప్రాజెక్ట్ ప్రస్తుత అంచనా వ్యయం ఆధారంగా లెక్కలు వేశాం.. భవిష్యత్తులో మారే అవకాశం ఉంది’ అని పేర్కొన్నారు.

‘థానే నుంచి బాంద్రా-కుర్లా స్టేషన్ల మధ్య ట్యాక్సీలో ప్రయాణించడానికి గంటన్నర సమయం పడుతోంది. రూ. 50 ట్యాక్సీ డ్రైవర్లు వసూలు చేస్తున్నారు. రూ. 250 చెల్లించి, బుల్లెట్‌ రైల్లో 15 నిముషాల్లోనే గమ్యస్థానం చేరిపోవచ్చు. నిర్దేశిత సమయం కంటే 40 సెకన్లు మించి రైలు ఆలస్యం కాదు. గరిష్ఠంగా గంటకు 320 కి.మీ. వేగంతో, ప్రతి 20 నిముషాలకు ఒకటి చొప్పున రోజూ 70 సార్లు ప్రయాణిస్తుంది. టికెట్‌ ధరలు ఏసీ మొదటి తరగతి ధరలతో పోలిస్తే 1.5 రెట్లు ఎక్కువగా ఉంటాయి. 2023.నాటికి బుల్లెట్‌ రైలు సేవలు పూర్తిగా అందుబాటులోకి వస్తాయి’ రైల్వేబోర్డు ఛైర్మన్‌ అశ్వని లొహాని తెలిపారు.