mictv telugu

బోట్ రేసింగ్‌కు బన్నీ… కేరళ ప్రభుత్వ ఆహ్వానం…

November 6, 2018

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు తెలుగులోనే కాదు కేరళలోనూ మంచి ఫ్యాన్స్ ఫాలోయింగ్ వుందన్న విషయం తెలిసిందే. మలయాళంలో బన్ని సినిమాలు అక్కడి స్టార్ హీరోల సినిమాలకు పోటీగా హిట్ కలెక్షన్లు సాధిస్తున్నాయి. అల్లు అర్జున్‌కు కేరళ అభిమానులు ముద్దుగా పెట్టుకున్న పేరు ‘మల్లు అర్జున్‌’. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్‌కు కేరళ ప్రభుత్వం ప్రత్యేక అతిథిగా అక్కడ జరగబోయే పడవల పోటీకి ఆహ్వానించింది. నవంబర్ 10న 66వ ఈ బోటింగ్ రేసింగ్ జరగనుంది. అలెప్పిలో జరగనున్న ఈ పోటీలో మొత్తం 81 బోట్లు పోటీ పడనున్నాయి.Telugu news Bunny for bot racing ... Kerala government invitation …బన్నీ కూడా ఈ కార్యక్రమానికి తప్పకుండా హాజరవుతున్నాడు. కేరళ ప్రభుత్వం తనకు కల్పించిన గౌరవంగా భావిస్తున్నాడు బన్నీ. కేరళలో బోట్ రేసింగ్ పోటీలు గత 65 ఏళ్లుగా కొనసాగుతున్నాయి.

Bunny for bot racing on Kerala government invitation …