త్వరలో తెలంగాణలో ఉప ఎన్నికలు ! - MicTv.in - Telugu News
mictv telugu

త్వరలో తెలంగాణలో ఉప ఎన్నికలు !

March 13, 2018

ప్రజలారా తెలంగాణలో అతి త్వరలో ఉప ఎన్నికలు రాబోతున్నాయి. ఓట్లు గుద్దడానికి రెడీగా ఉండండి. ఇంతకీ  ఎక్కడ రాబోతున్నాయి అనే కదా. ఇంకెక్కడ నల్గొండ, అలంపూర్ అసెంబ్లీ స్థానాల్లో రాబోతున్నాయి. ఈవిషయాన్ని స్వయానా  ఇరిగేషన్ మంత్రి హరీశ్‌రావ్ మీడియాతో జరిగిన చిట్ చాట్‌లో స్పష్టం చేశారు. ఈ రెండు స్థానాలు ఖాళీ అయ్యాయని ఎన్నికల కమీషన్ కు ఉత్తరం కూడా పంపామని హరీష్ రావ్ అన్నారు.

బడ్జెట్ సమావేశాల తొలిరోజే  కోమటి రెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ సస్పెండ్ అయిన విషయం తెలిసిందే . వారి  నియోజక వర్గాల్లోనే ఈ ఉపఎన్నికలు జరగపోతున్నాయి. అయితే సస్పెండ్ అయిన వారిద్దరూ  తమ రాజీనమా గురించి ఎటువంటి ప్రకటన చేయలేదు. ఇలాంటి సందర్భంలో హరీశ్ చేసిన ఉప ఎన్నికల ప్రకటన ఆసక్తిగా మారింది.