నెహ్రూ దొంగల ప్రధాని.. బ్రాహ్మణులు మూర్ఖులు! - MicTv.in - Telugu News
mictv telugu

నెహ్రూ దొంగల ప్రధాని.. బ్రాహ్మణులు మూర్ఖులు!

March 8, 2018

ఏ ఫర్ అంటే అందరం ఏం చెబుతాం  ఆపిల్, బి ఫర్ బాల్ అని కదా మనం మన గురువుల దగ్గర నేర్చుకున్న పాఠాలు.  కానీ ఇక్కడ ఓ గురువు ఎబిసిడిలకు కొత్త అర్థాలు చెబుతున్నాడు. ఎ ఫర్ ఆదివాసి,బి ఫర్ విదేశీ..సీ ఫర్ చోర్ అని  పాఠాలు నేర్పుతున్నాడు. జార్ఖండ్ రాష్ట్రంలోని కుతి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఓ టీచర్ చేస్తున్న నిర్వాకం ఇది. అంతేకాదు  సి ఫర్ అంటే చాచా నెహ్రూ దొంగల ప్రధాని, బ్రాహ్మిణ్స్ అంటే మూర్ఖులు అని ఆ గురువు బోధన చేస్తుంటే…ఆ విద్యార్థులు టీచర్ చెప్పిన దానికి  తిరిగి అప్పజెప్పుతున్నారు. అయితే దీని గురించి తెలుసుకున్న విద్యాశాఖ అధికారులు ‘నిజంగా ఆ టీచర్ ఇలా నేర్పిస్తున్నాడని మాకు తెలియదు, దీనిపై విచారణ జరుపుతామని’ అంటున్నారు.
ఒక మనిషి విద్యార్థి దశలో ఉన్నప్పుడు వారి భవిష్యత్తుకు పునాది వేసే వారే గురువులు.  ఇది మంచి.. ఇది చెడు అని విద్యార్థులకు పాఠాలు నేర్పించి వారిని తీర్చిదిద్దాల్సిన గురువే ..ఇలా వాళ్లను తప్పు దోవ పట్టిస్తుంటే ఇక వారు పెద్దయ్యాక  ఏమవుతారు. అది తప్పురా అంటే ఏహె స్కూల్లో మా సారు చెప్పాడు, ఇదే కరెక్టు అని వాళ్ల మనసుల్లో ఆ పాఠాలు బలంగా నాటుకుపోతాయి. దీని వల్ల లేనిపోని వివాదాలు తలెత్తుతాయి.  తన స్వంత అభిప్రాయాలను విద్యార్థులపై రుద్దుతున్న ఈ టీచర్’పై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.