ఫలక్‌నుమాకు బాంబు బెదిరింపు.. బయటికి చెప్పని పోలీసులు - MicTv.in - Telugu News
mictv telugu

ఫలక్‌నుమాకు బాంబు బెదిరింపు.. బయటికి చెప్పని పోలీసులు

November 29, 2017

ఇవాంకాతోపాటు జీఈఎస్ అతిథులందరికీ  భోజనం పెట్టిన  ఫలక్‌నుమా ప్యాలెస్‌కు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. ప్యాలెస్ వద్ద బాంబు పెట్టామని  గుర్తు తెలియని వ్యక్తి  మంగళవారం రాత్రి 9.46 గంటలకు పోలీసులకు కాల్ చేశాడు.

అతడు డీజీపీ కంట్రోల్ రూమ్‌కు ఇంటర్నెట్ వాయిస్ కాల్ చేసి ఫలక్‌నుమా ప్యాలెస్ పరిసర్ ప్రాంతాల్లో బాంబు పెట్టాం అని కాల్ చేశాడు.  ఈ విషయాన్ని అత్యంత గోప్యంగా వుంచి రాత్రంతా విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. అయితే ఎక్కడా బాంబు  ఆనవాళ్ళు కనిపించకపోయేసరికి ఇది వొట్టి బెదిరింపు కాల్ అని తేల్చారు.

బెదిరింపు కాల్ చేసిన వ్యక్తి ని గుర్తించి పట్టుకునే పనిలో వున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు సలహాదారు ఇవాంక, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు దేశ విదేశాలకు చెందిన దాదాపు 1500 మందికి ఆతిథ్యం ఇచ్చింది ఫలక్‌నుమా ప్యాలెస్. కేంద్ర ప్రభుత్వం ఈ విందును ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.