పూరీ జగన్నాథ్ తన కొడుకుని హీరోగా పెట్టి ఒక సినిమా తీస్తున్నాడు. ఈ సినిమాలో నూతన నటీనటుల కోసం కాస్టింగ్ కాల్ ప్రకటన కూడా ఇచ్చాడు. తన స్టైలిష్ పంథాలోనే ఈ సినిమా రూపొందనుందట. రీసెంటుగా బాలకృష్ణతో ‘ పైసా వసూల్ ’ సినిమా చేసిన పూరి. తాజాగా తన కొడుకు ఆకాష్ తో సినిమా చేసే యోచనలో వున్నాడు. ప్రస్తుతం ఆకాష్ విదేశాల్లో యాక్టింగ్ కు సంబంధించి శిక్షణ తీస్కుంటున్నాడు. అతను గతంలో ‘ ఆంధ్రా పోరీ ’ అనే సినిమాలో నటించి మెప్పించాడు కూడా. ఈ క్రమంలో సినిమాకి సంబంధించి కొత్త ఆర్టిస్టులు కావలెనని కాస్టింగ్ కాల్ ఇచ్చారు. 18 నుంచి 50 ఏళ్ల వయసున్న పురుషులు .. 18 నుంచి 45 ఏళ్ల వయసున్న స్త్రీలు ఎవరైనా ఈ సినిమాలో నటించాలని ఇంట్రెస్ట్ ఉంటే ఇచ్చిన మెయిల్ ఐడీకి డీటేల్స్ పంపాలని కోరారు. లవ్ స్టోరీ మూవీగా రూపొందనున్న ఈ చిత్రంతో ఆకాష్ స్టార్ హీరోగా మారడం ఖాయమని అంటున్నారు.