mictv telugu

రాహుల్ హిందువు కాదు.. హైబ్రిడ్ పిల్లగాడు

January 31, 2019

హిందూ అమ్మాయిలపై చెయ్యి వేస్తే చేతులు నరకండి అని వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచిన కేంద్రమంత్రి అనంత కుమార్ హెగ్డే మరోమారు తన తనదైన శైలిలో విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ బ్రాహ్మణుడని అని చలామణి కావడాన్ని ఆయన తప్పుబట్టారు.Telugu News Calling Rahul Gandhi 'Hybrid Specimen' Isn't The 1st Time Anantkumar Hegde Courted Controversy, Here Are A Few Of Themముస్లిం తండ్రి, క్రిస్టియన్ తల్లికి జన్మించిన రాహుల్ గాంధీ హిందువు ఎలా అవుతాడని ఆయన ప్రశ్నించాడు. రాహుల్‌ది హైబ్రిడ్‌ బ్రీడ్‌ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలో ఇలా ఎక్కడా జరగదని కేవలం భారత్‌లోని కాంగ్రెస్‌ పార్టీ ప్రయోగశాలలోనే ఇలాంటివి జరుగుతాయని ఎద్దేవా చేశారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు రాహుల్‌ బృందానికి బుద్ధి చెబుతారని అన్నారు. కర్ణాటక కాంగ్రెస్‌ చీఫ్‌ దినేష్‌ గుండూరావుపైనా హెగ్డే అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. గుండూరావు ముస్లిం మహిళ వెనుక దాక్కున్నారని ఇటీవల అనంత్‌ కుమార్‌ హెగ్డే వ్యాఖ్యానించడం వివాదాస్పదమైంది.