అసెంబ్లీ వద్ద కారు బుగ్గి.. తప్పిన ప్రమాదం

హైదరాబాద్లోని అసెంబ్లీ చౌరస్తాలో శనివారం ఉదయం కారు బుగ్గి అయింది. ఒక్కసారిగా ట్యాంకు పేలి మంటలు వ్యాపించాయి. డ్రైవర్ అప్రమత్తమై వెంటనే కారు దిగడంతో ప్రాణాపాయం తప్పింది.Telugu news car ablaze at Hyderabad Telangana Assembly cross roads driver escaped from accident fire police put offఏపీ 29 క్యూ 6441 నంబర్ శాంత్రో కారు లక్డీ కపూల్ చౌరస్తాలోని బంకులో పెట్రోల్ పోయించుకుని యూటర్న్ తీసుకుంటుండగా ఈ ప్రమాదం జరిగింది.  ఒక్కసారిగా మంటలు రావడంతో పక్కనే వెళ్తున్న మరో డ్రైవర్ అప్రమత్తం చేశాడు. దీంతో మంటలు లేచిన కారులోని డ్రైవర్ వెంటనే దిగిపోయాడు. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలు ఆర్పేశారు.