పెట్రోల్ బంకులోకి దూసుకెళ్లిన కారు.. డ్రైవింగ్ లర్నర్ మహిమ - MicTv.in - Telugu News
mictv telugu

పెట్రోల్ బంకులోకి దూసుకెళ్లిన కారు.. డ్రైవింగ్ లర్నర్ మహిమ

February 23, 2018

రోడ్డు మీద వెళుతున్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా వెళితే అంత మంచిది అన్నది పాత మాట అయిపోయింది. మనం జాగ్రత్తగా వెళ్తూ వెనక వాహనంవాడు, పక్కవాడు, ముందువాడు జాగ్రత్తగా వస్తున్నాడా లేక అదుపుతప్పి వస్తున్నాడా అని ఒళ్ళన్నీ కళ్లు పెట్టుకొని చూస్తూ రోడ్డు మీద వెళ్ళే పరిస్థితి నెలకొంది. మనమెక్కడో రోడ్డు పక్కనే ప్రశాంతంగా నిలబడతాం కానీ ఎవడో అదుపుతప్పిన వేగంతో మన మీదకు దూసుకొస్తాడు. సరిగ్గా అలాంటి ప్రమాదమే ఉత్తరప్రదేశ్‌లోని కనౌజ్ జిల్లాలో డ్రైవింగ్ స్కూల్ కారు బీభత్సం సృష్టించింది. కొత్తగా కారు డ్రైవింగ్ నేర్చుకుంటున్న వ్యక్తి రోడ్డు మీదకు వచ్చాడు. ఎక్సలేటర్ ఒక్కసారిగా పెంచి పెట్రోల్ బంక్‌లోకి దూసుకొచ్చాడు.

అక్కడ పాపం ఇద్దరు బైకుల వాళ్ళు పెట్రోల్ పోయించుకుంటున్నారు. ఒక్కసారిగా దూసుకొచ్చిన కారును చూసి ఇద్దరూ తప్పించుకున్నారు అయ్యారు కానీ ఒకరు మత్రం కారు చక్రాల కిందకు వచ్చాడు. కానీ ప్రాణాపాయం తప్పింది. పెట్రోల్ బంక్ సహా, రెండు, మూడు వాహనాలు ధ్వంసం అయ్యాయి. ఒకరికి తీవ్ర గాయాలు కాగా పలువురికి స్వల్ప గాయాలు అయ్యాయి.