పెళ్లి కాని మోడల్  బిడ్డకు పాలిస్తుందా? కేసు పెట్టండి! - MicTv.in - Telugu News
mictv telugu

పెళ్లి కాని మోడల్  బిడ్డకు పాలిస్తుందా? కేసు పెట్టండి!

March 2, 2018

ఈ ఫోటో గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. తల్లి తన బిడ్డకు బహిరంగంగా పాలిస్తే తప్పేంటి? దీనిపై చైతన్యం తీసుకురావడానికి  మలయాళ మ్యాగజైన్ ‘గృహలక్ష్మి’ ఈ ఫోటోను ప్రచురించింది. అయితే  దీనిపై ఓ లాయర్ కేసు వేశారు. ‘ఒక పెళ్లి కాని మోడల్‌ను బిడ్డకు పాలిచ్చినట్లు  ఎలా చూపిస్తారు? కేసు పెట్టి శిక్షించండి..’ అని  కొల్లం సీజీఎం కోర్టులో  మ్యాగజైన్  ప్రచురణ కర్త  మరియు మోడల్ గిలు జోసెఫ్‌లపై ఒక లాయర్ కేసు  పెట్టారు. అంతేకాదు ఫోటోలో కనిపించిన చిన్నారి తల్లిదండ్రులపై కూడా బాలల హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.ఓ  నిజమైన తల్లీ.. బిడ్డలను ఎంచుకుని ముఖచిత్రాన్ని  ప్రచురించకుండా… పెళ్లికాని మోడల్‌ గిలు జోసెఫ్‌ని కవర్‌ ఫొటోగా ఉంచడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి కూడా. అయితే దీనిపై గృహలక్ష్మి మ్యాగజైన్  చీఫ్ ఎడిటర్  స్పందిస్తూ ‘కవర్‌ పేజీ కోసం నిజమైన తల్లి చిత్రాన్ని ప్రచురించేందుకు అన్ని విధాలా  ప్రయత్నించాం, కానీ   విఫలమయ్యాం. ఏ ప్రయత్నం ఫలించక చివరకు  జోసెఫ్‌ను సంప్రదించాం. ఆమె ఆనందంగా ఒప్పుకొన్నారు’.  అయినా ఏ దృష్టికోణంతో ఆ ఫొటో చూస్తే అది అలా కనిపిస్తుంది. కేవలం ఫొటో ప్రచురణని వ్యతిరేకించడం వల్ల తల్లి స్వేచ్ఛగా బిడ్డకు పాలివ్వగలిగే పరిస్థితి పోదు కదా’ అని ఆయన  అన్నారు.