mictv telugu

చిక్కుల్లో రేవంత్‌.. ఈడీ నోటీసులు

February 12, 2019

ఓటుకు నోటు కేసులో ఈడీ విచారణ వేగవంతం చేసింది. తాజాగా కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి నోటీసులు జారీ చేసిన అధికారులు, వారం రోజుల్లో విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నరేందర్రెడ్డిని గెలిపించేందుకు నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు రూ.50లక్షలు లంచం ఇచ్చేందుకు ప్రయత్నించారు. దీనిపై అవినీతి నిరోధకశాఖ అధికారులు దాఖలు చేసిన అభియోగపత్రం ఆధారంగా ఈడీ అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు. ఈ కేసులో రేవంత్ రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, సెబాస్టియన్, ఉదయ్ కుమార్‌లను నిందితులుగా అనిశా పేర్కొంది.

ఈడీ అధికారులు మంగళవారం కాంగ్రెస్ నేత నరేందర్‌రెడ్డి, ఆయన కుమారుడు కృష్ణ కీర్తన్‌రెడ్డిని విచారించారు. విచారణ అనంతరం నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు పంపించారు. మూడున్నరేళ్ల తర్వాత ఎందుకు మళ్లీ విచారిస్తున్నారో నాకు అర్థం కావడంలేదు. నాతోపాటు నా పిల్లల్ని కూడా విచారణకు పిలిపించి వేధిస్తున్నారు. అధికారులు అడిగిన ప్రతీ ప్రశ్నకు నేను సమాధానం చెప్పాను’ అని పేర్కొన్నారు. Telugu News Cash For Vote Case ED Issues Notices To Revanth Reddy