ప్రేమించినందుకు..కుటుంబానికి శిక్ష - MicTv.in - Telugu News
mictv telugu

ప్రేమించినందుకు..కుటుంబానికి శిక్ష

October 30, 2017

ఉత్తరప్రదేశ్‌లో  ఘోరమైన సంఘటన జరిగింది.  వేరే కులానికి చెందిన యువతిని ప్రేమించాడన్న కారణంతో ఆ యువకుడి కుటుంబాన్ని దారుణంగా అవమానించారు. ఈ సంఘటన బిన్‌నోర్ జిల్లాలోని ఇస్లామాబాద్  గ్రామంలో చోటుచేసుకుంది. 4 నెలల క్రితం అదే గ్రామానికి చెందిన యువకుడు వేరే కులానికి చెందిన అమ్మాయిని ప్రేమించాడు.  ఈ విషయం గ్రామ పెద్దలకు తెలియడంతో, ఇద్దరిని పిలిపించి మందలించారు. దాంతో ప్రేమికులిద్దరూ..  ఊరు నుంచి పారిపోయారు. ఇప్పుడు ఆ యువకుడి తమ్ముడు కూడా వేరే కులానికి చెందిన అమ్మాయిని ప్రేమించాడు. దీంతో ఇద్దరు యువతుల( అన్నతో పారిపోయిన అమ్మాయి తాలుకు)  కుటుంబాలు … ఈ కుటుంబాన్ని రోడ్డుకీడ్చాయి. మెుత్తం కుటుంబ సభ్యులను, ఇంట్లోంచి రోడ్డు మీదకు ఈడ్చుకుంటూ తీసుకొచ్చారు. వారికి తోడు గ్రామస్తులు కూడా కలసి ఆ కుటుంబాన్ని మెుత్తం చెప్పులతో కొట్టి, మెడలో చెప్పులు దండ వేయించారు. ఆ బాధితుల్లో ఓ బాలుడు కూడా ఉన్నాడు.  ఈ ఘటనపై కేసు నమోదు చేసిన  పోలీసులు,  ఆ సంఘటనకు సంబంధించిన వారిని అదుపులోకి తీసుకున్నారు.