రాజకీయ పార్టీల్లోనూ కాస్టింగ్ కౌచ్ - MicTv.in - Telugu News
mictv telugu

రాజకీయ పార్టీల్లోనూ కాస్టింగ్ కౌచ్

April 24, 2018

రాజకీయాల్లో కూడా కాస్టింగ్ కౌచ్ వుందని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి అన్నారు. పడక పంచుకోకుండా మహిళలు రాజకీయాల్లో రాణించలేరని సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ కొరియోగ్రఫర్ సరోజ్ ఖాన్ కాస్టింగ్ కౌచ్ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అది మరిచిపోక ముందే రేణుకా చౌదరి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.

మీడియాతో మాట్లాడుతూ.. ‘ ప్రతీ రంగంలోనూ కాస్టింగ్ కౌచ్ వుంది. సినీ రంగంలోనే ఇలాంటి లైంగిక వేధింపులు జరుగడం లేదు. ప్రతీ చోట, ప్రతీ రంగంలో కాస్టింగ్ కౌచ్ వ్యవహారం నడుస్తోంది. దీని మీద ఇప్పుడిప్పుడే కొంత మంది అమ్మాయిలు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. కాస్టింగ్ కౌచ్‌కు రాజకీయాలు, పార్లమెంటు మినహాయింపు కాదు ’ అని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. రేణుకా చౌదరి వ్యాఖ్యల మీద రాజకీయంగా ఎలాంటి దుమారం రేగుతుందోనని పలువురు రాజకీయ ప్రముఖులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.