పోరలూ… ఫంకీఫంకీ జుట్టు, రింగులు, టాటూలు నడువయ్.. సీబీఐ - MicTv.in - Telugu News
mictv telugu

పోరలూ… ఫంకీఫంకీ జుట్టు, రింగులు, టాటూలు నడువయ్.. సీబీఐ

October 3, 2018

నేరాలను తగ్గించేందుకు సెంట్రల్ క్రైం బ్రాంచ్(సీబీఐ) పోలీస్ అధికారులు కొత్త పద్ధతులను ఎంచుకున్నారు. బెంగుళూరులో చెవి పోగులు, చేతులకు కడియాలు, వెరైటీగా జుట్టు, గడ్డాలు పెంచుకుని తిరిగుతున్న యువకులను పట్టుకుని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. బార్లలో అనుమానాస్పదంగా కనిపించిన వారిని, సీబీఐ పోలీసులకు అనుమానాస్పదంగా కనబడినవారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అనంతరం అమాయకులను వదిలేసి, నేరాలు చేసిన వారికి కౌన్సెలింగ్ ఇస్తున్నారు.

Punishment is wrong if not the procedure .. CBI

బెంగుళూరులోని సిలికాన్ నగరంలో ఆదివారం సీబీఐ పోలీసులు ఇలాంటి దాడులు నిర్వహించారు. బార్లు, పబ్‌లు, రెస్టారెంట్‌లపై దాడులు చేసి, 36 మంది రౌడీలను పట్టుకున్నారు. రౌడీలు తమ ప్రభావాన్ని పెంచుకోవడానికి ఎక్కడెక్కడ గ్యాంగ్‌లు కడుతున్నారు అనే దాని పట్ల సీసీబీ అధికారులు సమాచారం సేకరిస్తున్నారు. అలాగే చేతులపై వివిధ టాటూలు వేసుకునే వారిని హెచ్చరిస్తున్నారు. హెయిర్ స్టైల్, గడ్డం పెంచొద్దని సూచించారు.

గాంధీ జయంతి సందర్భంగా మంగళవారం సీసీబీ కార్యాలయంలో 500మంది రౌడీలకు పరేడ్ నిర్వహించి, వారిని మందలించారు.