కేంద్రంపై మనోజ్ ఫైర్.. సంకనాకిపోతామంటూ.. - MicTv.in - Telugu News
mictv telugu

కేంద్రంపై మనోజ్ ఫైర్.. సంకనాకిపోతామంటూ..

March 13, 2018

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా దక్కకపోవడంపై  సినీనటుడు మంచు మనోజ్ కూడా కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగాడు. తనను ట్విటర్‌లో అభిమానులు అడిగిన ప్రశ్నలకు  స్పందిస్తూ ఘాటుగా సమాధానాలు చెప్పాడు. మహారాష్ట్ర రైతుల డిమాండ్లను అంగీకరిస్తూ అక్కడి ప్రభుత్వం లిఖితపూర్వకంగా హామిచ్చిందని ఓ అభిమాని చేసిన ట్వీట్‌కు మనోజ్ వ్యంగ్యంగా స్పందించాడు. ‘మనకు ప్రత్యేక హోదా ఇస్తా అన్నారు. చిప్ప తప్ప ఏమీ మిగల్లేదు. కేంద్రాన్ని నమ్ముకుంటే సంకనాకి పోతాం’ అని ప్రతిస్పందించాడు.

మరో అభిమాని  ‘ రాష్ట్రంలో ఏ పార్టీని నమ్మాలి?’ అని అడగా మనోజ్ ‘నిన్ను నమ్మకోవడం ఉత్తమం’ అని జవాబు ఇచ్చాడు. ‘దక్షిణాదిలో రెండో రాజధాని పెట్టే వరకు ఈ బానిస బతుకులు తప్పవని’ తీవ్రంగా స్పందించాడు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వకపోవడంపై హీరో నిఖిల్, దర్శకుడు కొరటాల శివ, నటుడు,మోహన్ బాబు, దర్శకుడు బీవీఎస్ రవి, రచయిత కొన వెంకట్ తదితరులు కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీపై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.