రూ. 2 వేల లోపు లావాదేవీపై నో చార్జ్ - MicTv.in - Telugu News
mictv telugu

రూ. 2 వేల లోపు లావాదేవీపై నో చార్జ్

December 16, 2017

గత ఏడాది పెద్ద నోట్ల రద్దుతో సామాన్య ,మధ్య తరగతి ప్రజలు నగదు లావాదేవీల సమస్యలతో చాలా సతమతమయ్యారు. ఇప్పుడు వారికి కేంద్ర ప్రభుత్వం చల్లని కబురు చెప్పింది. డెబిట్ కార్డు ద్వారా జరిపే రూ. 2వేల లోపు లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంల్ రేట్( ఎండీఆర్ ) చార్జీలను విధించబోమని ప్రకటించింది. అన్ని బ్యాంకుల డెబిట్ కార్డులతో పాటు భీమ్ యూపీఐ/ఏఈపీఎస్‌ల ద్వారా రూ. 2వేలు అంతకంటే తక్కువ లావాదేవీలు జరిపే వారికి మర్చంట్ డిస్కౌంట్ ను ప్రభుత్వం భర్తిస్తుందని తెలిపింది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి రెండెళ్ల పాటు బ్యాంకులకు ప్రభుత్వమే చేల్లించాలని మంత్రి వర్గ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దేశంలో నగదు రహిత ( డిజిటల్) చెల్లింపులను విస్తృతంగా  నిర్వహించాలని నిర్ణయించడం తెలిసిందే.