కేంద్రమంత్రి నా భూమిని కబ్జా చేశాడు.. - MicTv.in - Telugu News
mictv telugu

కేంద్రమంత్రి నా భూమిని కబ్జా చేశాడు..

February 10, 2018

కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్‌పై పట్నా పోలీసు స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఓ దళిత వ్యక్తికి చెందిన భూమిని కబ్జా చేశాడని ఆరోపణలతో రావడంతో కోర్టు ఇచ్చిన ఆదేశాలతో పోలీసులు ఎఫ్ఐఆర్‌లో కేంద్రమంత్రి పేరును చేర్చారు. బిహ‌ర్‌కు చెందిన రామ్ నారాయణ ప్రసాద్ అనే వ్యక్తికి సంబంధించిన భూమిని తప్పుడు పత్రాలు, సంతకాలతో ,అధికారుల అండతో  గిరిరాజ్ తన పేరుతో రిజిస్టర్ చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో మొత్తం 32 మంది నిందితులు ఉండగా కేంద్రమంత్రిది 25వ నంబరు.

ఈ కేసుపై స్పందించిన గిరిరాజ్ మాట్లాడుతూ.. ‘నేను ఒక స్థలాన్ని కొన్నాను. ఒరిజినల్ భూమి యాజమాని ద్వారానే ఆ భూమిని కొన్నాను. ఆ భూమి ఆ పిర్యాదుదారుడిది కానే కాదు’ అని చెప్పుకొచ్చారు. ఎఫ్ఐఆర్‌లో కేంద్రమంత్రి పేరు చేర్చడంతో బీహర్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రభుత్వం పై ఆర్జేడీ విమర్శలకు దిగింది. బీజేపీ మిత్రపక్షంగా ఉన్న నితీశ్ కుమార్ ఇప్పుడు ఈ కబ్జా వ్యవహారంపై ఏం మాట్లాడతారని మాజీ డిప్యూటీ సీఎం తేజశ్వీ యాదవ్ ప్రశ్నించారు. గిరిరాజ్ రాజీనామాను నితీష్ కోరగలరా? అంటూ ఎద్దేవా చేశారు.