పేరు మార్చుకున్న కేంద్రమంత్రి.. హిందువులంతా మార్చుకోవాలంట.. - MicTv.in - Telugu News
mictv telugu

పేరు మార్చుకున్న కేంద్రమంత్రి.. హిందువులంతా మార్చుకోవాలంట..

September 25, 2018

నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే బీజేపీ సీనియర్ నేత, కేంద్రమంత్రి  గిరిరాజ్‌సింగ్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఆయన తన పేరు మార్చుకున్నారు. ఇప్పటి నుంచి ఆయన పేరు గిరిరాజ్ సింగ్ కాదు.. ‘శాండిల్య గిరిరాజ్ సింగ్’. తన పేరుకు మందు ‘గోత్రాన్ని’ కలిపి పెట్టుకున్నారు. తాను మార్చుకోవడమే కాక హిందువులంతా ఇలా పేరుకు ముందు గోత్రాన్ని పెట్టుకుని ‘సనాతన ధర్మాన్ని’ అనుసరించాలని కోరారు.

Central Minister Giriraj Singh Changed His Name requests all Hindus to change their names for the sake of sanathan Dharma

దేశాన్ని కాపాడాలంటే సనాతన ధర్మాన్ని కాపాడాలని, ఆ ధర్మాన్ని కాపాడాలంటే మహర్షులు చూపిన బాటలో నడవాలని కేంద్ర మంత్రివర్యులు సూచించారు. ‘గోత్రాలను కలుపుకోవడంతోపాటు.. రుషి శాండిల్యుడి పేరు చేర్చుకుంటూ.. నా పేరును శాండిల్య గిరిరాజ్ సింగ్‌గా మార్చుకుంటున్నాను. సనాతనులందరూ తమ పేరులో గోత్రాన్ని చేర్చుకోవాలి’ అంటూ ట్వీట్ చేశారు.