పబ్లిక్‌లో అధికారిని తిట్టిన మంత్రి ! - MicTv.in - Telugu News
mictv telugu

పబ్లిక్‌లో అధికారిని తిట్టిన మంత్రి !

February 17, 2018

కేంద్ర మహిళా,శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ బాధ్యతాయుతమైన పదవిలో ఉండి  వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం నిర్వహించిన పబ్లిక్ కార్యక్రమంలో మేనకాగాంధీ ఓ అధికారిని   దూషించారు. అందరికి ముందే అధికారిని పరుష పదజాలంతో చివాట్లు  పెట్టారు. ఆ అధికారి  అవినీతికి పాల్పడుతున్నాడని ఇచ్చిన ఫిర్యాదు మేరకు  మేనక ఈ విధంగా స్పందించారు.

పబ్లిక్ మీటింగ్‌లో ఆ అధికారిని  తిట్టడంతో  ,ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు. ముఖ్యంగా ఆయన్ను అందరి ముందు తిట్టడం ,అవమానించడం చర్చనీయాంశమైంది. ఉత్తరప్రదేశ్‌ బహేరీలో పీడీఎస్‌ స్కీమ్‌ను పరిశీలించడానికి వెళ్లిన్నప్పుడు మేనకా ఈ వ్యాఖ్యలు చేశారు.