బుల్డోజర్‌తో తొక్కిస్తా.. కేంద్రమంత్రి  గడ్కరీ. - MicTv.in - Telugu News
mictv telugu

బుల్డోజర్‌తో తొక్కిస్తా.. కేంద్రమంత్రి  గడ్కరీ.

December 7, 2018

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిగా పని చేస్తున్న ఆయన తాజాగా పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ.. ‘రోడ్లు దేశం ఆస్తులు. నాణ్యత విషయంలో రాజీపడేదే లేదు. ఒక వేళ రోడ్లు పాడైతే ఆ కాంట్రాక్టర్‌పై బుల్డోజర్‌తో తొక్కిస్తా..’ అంటూ వ్యాఖ్యానించారు.

Telugu News Central Minister nitin gadkari Sensational Comments On Contractors

ఇప్పటికే 10లక్షల కోట్ల పనులకు ఆర్డర్ ఇచ్చామని, ఆర్డర్ కోసం ఏ కాంట్రాక్టర్ మా ఆఫీసుకు రావాల్సిన అవసరం లేదని గడ్కరీ అన్నారు. నాణ్యత విషయంలో ఏ సమస్య వచ్చినా.. కాంట్రాక్టర్లపై బుల్డోజర్ ఎక్కిస్తానని చెప్పినట్లు నితిన్ పేర్కొన్నారు. భవిష్యత్తులో ఈ రోడ్డు మార్గంలో నవీ ముంబై ఇంటర్నేషన్ ఎయిర్‌పోర్టుకు వెళ్లాలంటే.. కేవలం 20 నిమిషాల సమయం మాత్రమే పడుతుందని గడ్కరీ పేర్కొన్నారు.

Telugu News Central Minister nitin gadkari Sensational Comments On Contractors