స్మృతి ఇరానీని వెంబడించిన యువకుల అరెస్టు... - MicTv.in - Telugu News
mictv telugu

స్మృతి ఇరానీని వెంబడించిన యువకుల అరెస్టు…

April 17, 2018

కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ  కారును వెంబడించిన నలుగురు ఢిల్లీ విద్యార్థులను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఫిబ్రవరిలో ఢిల్లీ విమానశ్రయం నుంచి ఇంటికి వెళ్తున్న సమయంలో నలుగురు యువకులు  ఆమె కారును వెంబడించారు. దీంతో వెంటనే పోలీసులకు ఫోన్ చేసి ,తనను కొందరు యువకులు వెంబడిస్తున్నారని ఫిర్యాదు చేసింది.రంగంలోకి దిగిన చైతన్యపురి పోలీసులు నలుగురు యువకుల్ని అదుపులోకి తీసుకుని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అనంతరం వైద్యపరీక్షలు నిర్వహించగా వారు మద్యం సేవించినట్లు తేలింది. రిపోర్టుల నేపథ్యంలో నలుగురు విద్యార్థులపై పోలీసులు చార్జ్‌షీటు దాఖలు చేశారు.