త్వరలో 2 వేల నోట్లు రద్దు.. అనుమానానికి ఇవీ బలాలు!

నవంబర్ 8.. రోజు గుర్తొస్తే చాలు ప్రజల్లో గుండెదడ మొదలవుతుంది. సరిగ్గా రెండేళ్ల కిందట ఇదే రోజు  ప్రధాని నరేంద్ర మోదీ పెద్ద నోట్లను రద్దు చేసి ఎలాంటి  పరిణామాలకు కారణమయ్యారో తెలిసిందే. నోట్ల రద్దుతో ఒరిగిందేమీ లేదని సగటు జనాభిప్రాయం. మరోపక్క.. అక్రమధనమంతా పెద్దనోట్ల రూపంలోనే మేటలు వేసి దొరుకుతుండడం ప్రభుత్వాన్ని నివ్వెరపరుస్తోంది. నోట్లరద్దుతో ఆశించిన ప్రయోజనాలు నెరవేరలేదని భావిస్తున్న మోదీ త్వరలో మరో సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లు కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి.

tt

రూ.500, రూ. 2000 నోట్లను మళ్లీ రద్దు చేయబోతున్నారని, మోదీ ఈ నిర్ణయాన్ని గతంలో మాదిరే అర్ధరాత్రి ఆకస్మికంగా ప్రకటిస్తారని వార్తలు వస్తున్నాయి. గత ఏడాది… 2017 నవంబర్ 8వ తేదీనే ఆయన వీటిని రద్దు చేస్తారని వార్తలు రాగా అది అసత్యమని తేలిసింది. దీంతో 2018 నవంబర్ 8కి మూహూర్తం మార్చారని వార్తలు వచ్చాయి. అయితే ఇలా ‘ముహూర్తాలు’ పెట్టి రద్దు చేయరని, ఆయన ఎప్పుడు అనుకుంటే అప్పుడు రద్దు చేస్తారని అనుయాయులు చెప్పారు. అయితే త్వరలో జరిగే నాలుగు రాష్ట్రాల ఎన్నికలతోపాటు, వచ్చే ఏడాది లోక్ సభ ఎన్నికలు ఉండడంతో ఈ రోజు కాకుండా అతిత్వరలో ఆయన పెద్ద నోట్లను రద్దు చేస్తారని, అక్రమ ధనం చలామణి కాకుండా చర్య తీసుకోవడానికి ఇలాంటి ఎన్నికల సమయమే అత్యంత అనుకూలమైందని భావిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

పెద్ద నోట్ల రద్దు నిజానికి మేలు కలిగించి ఉండే ప్రజలు వ్యతిరేకించేవారు కారని, అయితే రెండు వేల నోట్లు అక్రమార్జనకు మరింత దోహదపడేవిగా మారడంతో మోదీ కూడా వాటిపై పునరాలోచనలో పడ్డారని అంటున్నారు. తాజాగా ఆర్బీఐకి, కేంద్రానికి మధ్య మొదలైన రగడ, ఎన్నికల్లో విపక్షాలకు డబ్బు చేతికందకుండా చూడడం వంటి అన్ని కోణాల్లో ఆలోచించి ఆయన సరైన నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు. నోట్ల రద్దు తర్వాత జరిగిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయం సాధించడం కూడా ‘రద్దు’కు ఊతమిచ్చే అంశమని అంటున్నారు. అయితే గత నోట్ల రద్దు అమల్లో జరిగిన లోపాలను ఈ సారి పునావృతం చేయకుండా, కేవలం అక్రమ సంపాదన పరులను మాత్రమే ఇబ్బందిపెట్టేలా చర్యలు ఉంటాయని పేర్కొంటున్నారు. మరోపక్క.. ప్రభుత్వం ప్రస్తుతం నోట్ల రద్దుగురించి ఆలోచించడం లేని ఆర్థిక సహాయమంత్రి పొన్ రాధకృష్ణన్ గతంలో వివరణ ఇవ్వడం విశేషం. అయితే ఆర్థిక మంత్రికి, ఆర్బీఐకే చెప్పకుండా రద్దు చేసిన మోదీ.. రద్దు సంగతిని పొన్ రాధాకృష్ణన్ కు చెబుతారా అనే వ్యంగ్యాస్త్రాలు కూడా పడ్డాయి!

Telugu news Centre to withdraw Rs 2,000 currency notes? Here is truth fear has been expressed in public repeatedly that the Rs 2,000 currency notes will be withdrawn.