చైనాలోని వ్యాంగ్‌డంగ్ ప్రావిన్స్‌లో ఘోర ప్రమాదం జరిగింది. షోషైంగ్ ప్రాంతంలో సబ్వే నిర్మాణ పనులు జరుగుతుండగా రోడ్డు ఉన్నట్టుండి కుంగిపోయింది. ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు గల్లంతయ్యారని అధికారులు చెప్పారు.
ఈ ఘటనలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంల్లో రాకపోకలు ఆగిపోయాయి. ఈ ప్రమాదానికి గల కారణాలపై అధికారులు విచారణ ప్రారంభించారు. రెండు బాస్కెట్ బాల్ మైదానాలంత పరిమాణంలో రోడ్డు 20 అడుగుల లోతుకు కుంగిపోయింది. సబ్ వే నిర్మాణ కోసం తవ్విన గుంతల ఫలితంగా పైపులు లీకై రోడ్డుకిందకి నీరు చేరిందని అధికారులు చెప్పారు.