ఏపీ.. ఈ దేశంలో భాగం కాదా? కేంద్రానికి బాధ్యత లేదా?.. బాబు - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీ.. ఈ దేశంలో భాగం కాదా? కేంద్రానికి బాధ్యత లేదా?.. బాబు

March 12, 2018

కేంద్ర ప్రభుత్వం తమ రాష్ట్రం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు విరుచుకుపడ్డారు. ‘విభజన చట్టంలో ఉన్నవే అమలు చేయాలని కేంద్రాన్ని కోరుతున్నామే తప్ప వ్యక్తిగతంగా ఏమీ కోరడం లేదు.  కేంద్రం కేవలం మాటలు చెప్పి తప్పించుకుంటోందే తప్ప విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకోవడం లేదు. పోలీసు అకాడమీ, సీసీఎంబీ వంటి సంస్థలు ఆంధ్ర ప్రదేశ్‌‌కు ఎందుకు ఇవ్వరు? ఆంధ్రప్రదేశ్‌ భారతదేశంలో భాగం కాదా?. విశాఖ రైల్వేజోన్‌, కడపలో ఉక్కు కర్మాగారం హామీలను అలాగే  అమరావతి, విశాఖ నగరాల్లో మెట్రో ప్రాజెక్టులకు కేంద్రం మొండిచేయి చూపెడుతోంది. ఏపీకి పారిశ్రామిక రాయితీలు ఎందుకివ్వరో కేంద్రం చెప్పాలి.మేం ఎన్నో దేశాలు తిరిగి రాబట్టిన పెట్టుబడులు కేంద్రం వల్లే వచ్చాయని కొందరు చెబుతుంటే విడ్డూరంగా ఉంది. . ఏపీ శాసనసభ స్థానాలు పెంచుతామన్నారు. ఆ హామీ పట్టించుకోవడం లేదు. దాన్ని గట్టిగా అడిగితే నాపై బురద జల్లుతున్నారు’ అని చంద్రబాబు అన్నారు. చాలా సందర్భాల్లో కేంద్రం సహకరించకపోయినా కూడా మేం వెనకడుగు వేయలేదు.  ఆర్ బీఐ ఒప్పుకోకపోయినా రైతు రుణమాఫీ చేశాం అని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.