ఔనా.. చంద్రబాబు మాల్యా నుంచి 150 కోట్లు తీసుకున్నాడా ? - MicTv.in - Telugu News
mictv telugu

ఔనా.. చంద్రబాబు మాల్యా నుంచి 150 కోట్లు తీసుకున్నాడా ?

April 2, 2018

బ్యాంకులకు ఎగనామం పెట్టి విదేశాలకు చెక్కేసిన విజయ్ మాల్యాను ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలిసారని ఆరోపించారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి.  మార్చి 2016 లో మాల్యాను లండన్‌లో చంద్రబాబు కలిశారని తెలిపారు. ‘మాల్యా నుంచి టీడీపీ కోసం రూ. 150 కోట్ల విరాళం తీసుకున్నారు. దీనిపై చంద్రబాబు వివరణ ఇవ్వకపోతే నేను చేసిన ఆరోపణలను నిజమేనని రుజువు అవుతాయి. గత నాలుగేళ్లుగా మోసం చేస్తున్న చంద్రబాబును ప్రజలు ఇకముందు నమ్మే పరిస్థితి లేదు..’ అని రెడ్డి అన్నారు.మరోసారి అధికారంలోకి వచ్చేందుకే చంద్రబాబు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిపారు. మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు చంద్రబాబుపై సభాహక్కుల నోటీసులు ఇచ్చామని చెప్పారు. చంద్రబాబు ఢిల్లీ వస్తున్నది కూడా రాజకీయ లబ్ధకోసమేనని అన్నారు.