లైట్ తీసుకునేవాడిని..అందుకే ఇంటర్ ఫేయిల్ అయ్యా! - MicTv.in - Telugu News
mictv telugu

లైట్ తీసుకునేవాడిని..అందుకే ఇంటర్ ఫేయిల్ అయ్యా!

February 27, 2018

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన రాజకీయ జీవితం 40 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఓ చానెల్ కి ఇంటర్వూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘నేను 16 ఏళ్ల వయసున్నప్పుడు అన్ని విషయాలను లైట్ తీసుకునేవాడిని అందుకే ఇంటర్ ఫస్టియర్ ఫేయిలయ్యా. ఆ తర్వాత తిరుపతి వెళితే తన చదువు గాడిలో పడి, నాకు అన్ని విజయాలే వరించాయి. విద్యార్థిగా ఉన్నప్పుడు నేను సిగరెట్ తాగలేదు. హింస అనే పదానికి నాజీవితంలో  చోటు లేదు. విద్యార్థి దశలో తోటి విద్యార్థులు మా బ్యాచ్ తో గొడవలు పడి, కేసులు కూడా అయ్యాయి.ఆ తర్వాత ఇరు వర్గాలు కాంప్రమైస్ కావడంతో ఆ కేసును కొట్టేశారు.  స్టూడెంట్ గా ఉన్నప్పుడు చేసిన రాజకీయాలు వేరు. వాటినే మంత్రిగా, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేస్తే ఫ్యాక్షనిస్టులు అవుతారు. పదవిని అనుసరించి స్వభావాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది’ అని ఆయన తన అనుభవాలను,అభిప్రాయాలను సదరు చానెల్ తో పంచుకున్నారు.