mictv telugu

మీ ఇంటికొచ్చి మిమ్మల్నే కొడతా అన్నట్టుంది.. కేసీఆర్

November 21, 2018

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబునాయుడు వేసిన శిలాఫలకాలను కృష్ణానదిలో అడ్డం వేస్తే.. ఏకంగా ఓ డ్యామే తయారవుతుందని  తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు.

జడ్చర్లలో ఈ రోజు జరిగిన ప్రజాఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడుతూ… ‘ప్రొ.జయశంకర్‌ సార్‌తో కలిసి నేను తెలంగాణ అంతటా పర్యటించాను. అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో పాలమూరు జిల్లా దుస్థితి చూసి నా గుండె తరుక్కుపోయి కన్నీళ్ళు పెట్టుకున్నాను. ఈ మహబూబ్ నగర్ జిల్లాను దత్తత తీసుకున్న చంద్రబాబు తొమ్మిదేళ్ల  పాలనలో ఏం అభివృద్ధి చేశారో చెప్పాలి. పాలమూరు ప్రాజెక్టు కట్టొద్దని ఢిల్లీకి ఉత్తరాలు రాసిన చంద్రబాబు, ఏ ముఖం పెట్టుకుని తెలంగాణలో ఓట్లు అడుగుతారు? గత నాలుగేళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా కరీంనగర్ రిజర్వాయర్, పట్టెం, నార్లాపూర్ రిజర్వాయర్లను నిర్మించింది. ఇప్పుడిప్పుడే పాలమూరు జిల్లా కష్టాలు తీరుతున్నాయి’ అని చెప్పారు.   Telugu news Chandrababu's attitude is that if you get into your house you will be beaten up .. KCRటీడీపీ తరఫున పవన్ కుమార్ రెడ్డి, హర్షవర్దన్ రెడ్డి, నాగం జనార్దన్ రెడ్డి కోర్టుల్లో 35 కేసులు వేసి పాలమూరు ప్రాజెక్టును అడ్డుకునే కుట్ర చేశారని కేసీఆర్ ఆరోపించారు.

టీడీపీకి ఓటు వేసి మోసపోవడానికి పాలమూరు ప్రజలు గొర్రెలు, అమాయాకులు కాదని అన్నారు. చంద్రబాబు వైఖరి చూస్తుంటే మీ ఇంట్లోకి వచ్చి మిమ్మల్ని కొట్టి పోతా.. అన్నట్టు వుందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు తెలంగాణను వదలా బొమ్మాళీ అన్నట్టే వెంటపడుతున్నాడని అన్నారు. మహాకూటమి నేతలకు ఈ ఎన్నికల్లో బాగా బుద్ధి చెప్పాలని అన్నారు.