చంద్రబాబు అంతులేని ఆనందం… కారణం ఇదేనా...? - MicTv.in - Telugu News
mictv telugu

చంద్రబాబు అంతులేని ఆనందం… కారణం ఇదేనా…?

December 6, 2018

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల  ప్రచారం ముగింపు చివరి రోజున చంద్రబాబు నాయుడు ఫుల్ హ్యాపీగా ఉన్నట్లున్నారు. ప్రచారం ప్రారంభించిన తొలి సభలో  స్మూత్‌గా మాట్లాడారు. కేసీఆర్ ఎందుకు తిడుతున్నారో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కోదాడ సభలో కేసీఆర్ పాలన గురించి మాట్లాడారు. ఆయనను నియంతతో పోల్చారు. తొలి నుండి ఇలాగే మాట్లాడితే పరిస్థితి ఎలా ఉండేదో తెలియదు. లగడపాటి రాజగోపాల్ సర్వే  గురించి చెప్పిన తర్వాత చంద్రబాబు హావభావాల్లో తేడా చాలా స్పష్టంగా కన్పిచిందని సభికులు మాట్లాడుకోవడం కన్పించింది.

లగడపాటి రాజగోపాల్  తనకు తానే పెట్టుకున్న నిబంధనలకు విరుద్దంగా సర్వే ఫలితాలు విడుదల చేశారు. దీనికి  ఏ ఉద్దేశ్యం ఉందనే దానికంటే లగడపాటి సర్వే గడబిడ తర్వాత కూటమి నాయకులు మాత్రం ఫుల్ ఖుషీలో ఉన్నారు. రాజగోపాల్ మీడియా మీట్ పెట్టిన తర్వాత ఇక చంద్రబాబునాయుడుతో సహా కూటమి నాయకులంతా ఆహా అనుకున్నట్లున్నారు. సత్తుపల్లి, కోదాడ సభల్లో చంద్రబాబు నాయుడు ఫేస్ వెయ్యి ఓల్టేజీ బల్బుల కంటే ఎక్కువగా వెలిగిందని  కొందరు అంటున్నారు.

వారం రోజులుగా చంద్రబాబు నాయుడు ఆయన బావమర్ది, ఎమ్మెల్యే  బాలకృష్ణ హైదరాబాద్‌లో ప్రచారం చేశారు. తొలుత చంద్రబాబు నాయుడు ప్రచారాన్ని హైదరాబాద్‌కే పరిమితం చేయాలని అనుకున్నారట. ఖమ్మం జిల్లాలో టీడీపీ ఉనికి ఉంది కాబట్టి అక్కడ మాత్రం సభ నిర్వహించి హైదరాబాద్‌తో ముగించాలని భావించారట కూటమి నాయకులు. తొలుత కూటమి నాయకులకు కూడా ప్రచారం విషయంలో క్లారిటీ లేదని ప్రచారం చేస్తున్న కీద్ది మరిన్ని  రోజులు పెంచాలని అనుకున్నారట. అందులో భాగంగానే రాహుల్ గాంధీ సభల సంఖ్యను కూడా పెంచారట.Telugu news Chandrababu's endless happyness ... the reason is this ..లగడపాటి రాజగోపాల్ సర్వే గురించి చెప్పిన తర్వాత కూటమి నాయకులు ఫుల్ ఖుషీలో ఉండటమేకాదు….. తామే గెలుస్తామనే ధీమాను వ్యక్తం చేస్తున్నారు. వీరి ఆనందం ఆవిరవుతుందో… లేకపోతే నిజమే అవుతుందో  తెలియదు కానీ ముందు మురువడం అయితే మంచిది కాదని తెలుగువారు ఎక్కువగా చెప్పుకునే సామెత అని కొందరు గుర్తు చేస్తున్నారు.

తెలుగువారి గురించి… తెలుగు ప్రజల కష్టాలు,  బాధల గురించి తెలంగాణ ప్రచారంలో గుండెలు బాదుకున్న చంద్రబాబు నాయుడు ఏపీ ప్రజల గురించి ఏం చేస్తాడోనని అక్కడ వైసీపీ నాయకులు  కొందరు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు నాయుడు తెలంగాణ ఎన్నికల ప్రచారంలో చూపించిన ఊపును ఏపీలో చూపించే ఛాన్సు లేదని కొందరు అంటున్నారు.

నీళ్లు, నిధులు నియామకాల గురించి పదేపదే  చంద్రబాబుతో కలిసి పంచుకున్న సభల్లో మాట్లాడిన రాహుల్ గాంధీ కూడా ఏపీలో నిరుద్యోగుల గురించి చంద్రబాబు నాయుడు ఎందుకు పట్టించుకోవడం లేదనే విమర్శల విషయాన్ని ఆయన  గుర్తించలేకపోయారని మరి కొందరు అంటున్నారు.

ప్రచారం ముగిసిన తర్వాత కూటమి నాయకులంతా కలిసి పెట్టిన మీడియా మీట్‌లో కూడా చంద్రబాబు ఫుల్ జోష్‌లో కన్పించారు. మిగతా నాయకులు వారివారి  ఫీలింగ్స్ ఎక్కడా బయట పెట్టలేదు. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం ఓ రేంజ్‌లో ఫీల్ అవుతున్నారని, అందుకే లగడపాటి పేరును కూడా ప్రచార సభల్లో ప్రస్తావించారని రాజకీయ పండితులు చెప్తున్న మాట.

కూటమి తరఫున ప్రచారానికి వచ్చిన బాబు తొలుత మెత్తగా మాట్లాడినా, ఆ తర్వాత స్వరాన్ని పెంచారు. ప్రచారం చివరి రోజు మాత్రం స్వరం అమాంతం పెంచారు.  తమ్ముళ్లు ఇక అయిపోయిందంటూ తన సహజ ధోరణిలో ఉపన్యాసం దంచారు. తెలంగాణ ప్రజలు తమకు ఏది మంచో దాన్నే ఎంచుకుంటారని గత రాజకీయానుభవం ఉన్నవారు చెప్తున్న మాట. లగడపాటి   సర్వే మాటలు చంద్రబాబులో జోష్ నింపాయని మాత్రం ఇక్కడి ప్రజలు అనుకుంటున్నమాట.