చంద్రయాన్-2 మార్చిలో - MicTv.in - Telugu News
mictv telugu

చంద్రయాన్-2 మార్చిలో

October 25, 2017

2018 మార్చిలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో  శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుంచి మరో అద్భుత ప్రయోగం చేయనున్నది. దానిపేరే ‘చంద్రయాన్-2 ’. ఇది పూర్తిగా మానవ రహిత ప్రయోగమని తెలిసిన విషయమే.

2008 తర్వాత చాలా ఏళ్ళకు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నదానికి స్పష్టత వచ్చింది. దీనిపై కేంద్ర అంతరిక్ష, అణు ఇంధన శాఖ మంత్రి జితేంద్ర సింగ్‌ తాజాగా ప్రకటన చేశారు. ఇస్రో శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుండి జీఎస్‌ఎల్వీ ఎంకే – 2 రాకెట్‌ ద్వారా చంద్రయాన్‌-2 ప్రయోగాన్ని నిర్వహిస్తామన్నారు. 2008లో చంద్రయాన్-1 ద్వారా భారత్  చంద్రగ్రహంపైకి పరోశోధక నౌకను పంపిన నాలుగో దేశంగా రికార్డు సృష్టించింది.