డ్రగ్స్ కేసులో ముగ్గురిపై ఛార్జ్‌షీట్ - MicTv.in - Telugu News
mictv telugu

డ్రగ్స్ కేసులో ముగ్గురిపై ఛార్జ్‌షీట్

April 7, 2018

తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన డ్రగ్స్ కేసు మళ్ళీ తెరమీదకు వచ్చింది. ఈ కేసులో దర్యాప్తు సంస్థ సిట్ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఈ మేరకు  ఎక్సెజ్ సిట్ ముగ్గురు సినీ ప్రముఖులపై అభియోగాలను నమోదు చేసింది. అందులో ఒక దర్శకుడు, ఇద్దరు హీరోలు డ్రగ్స్ వాడుతున్నట్లు సిట్ తన నివేదికలో తెలిపింది. కానీ ఆ ముగ్గురి పేర్లు మాత్రం వెల్లడించలేదు. ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా ఈ ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేశారు.ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ అకున్ సబర్వాల్ మాట్లాడుతూ.. ‘ డ్రగ్స్ వాడిన ముగ్గురు సినీ ప్రముఖులపై ఛార్జ్‌షీట్ వేశాం. ఇంకా మరికొందరి ఫోరెన్సిక్ నివేదిక అందాల్సి ఉంది. ఆ నివేదిక వచ్చిన తరువాత మరికొందరిపై కూడా ఛార్జ్‌షీట్ వేస్తాం ’ అని అకున్ సబర్వాల్ తెలిపారు.