స్వచ్ఛతకు చిహ్నం మన చార్మినార్ - MicTv.in - Telugu News
mictv telugu

స్వచ్ఛతకు చిహ్నం మన చార్మినార్

November 22, 2017

పురాతన కట్టడమైన చార్మినార్‌ను  కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛతకు చిహ్నంగా ప్రకటించింది. స్వచ్ఛభారత్ మిషన్‌లో భాగంగా కేంద్రం పది ప్రముఖ స్థలాలను స్వచ్ఛతకు గుర్తింపు చిహ్నంగా మార్చనుంది.  దానిలో భాగంగానే చార్మినార్‌కు ఈ అరుదైన గౌరవం దక్కింది.

స్వచ్ఛతకు చిహ్నంగా ఎంచుకున్న పది ప్రాంతాలను ఎల్లప్పుడు పరిశుభ్రంగా ఉంచేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తామని కేంద్రం ప్రకటించింది. అందులో భాగంగానే చార్మినార్‌ బాధ్యతను కేంద్ర ప్రభుత్వం ఎన్టీపీసీకి అప్పగించింది. ఇక చార్మినార్ తర్వాత దేశంలోని స్వచ్ఛతకు చిహ్నాలుగా మారనున్న ప్రాంతాలు ఇవే.

1.చార్మినార్, 2. గంగోత్రి, 3. యమునోత్రి, 4. ఉజ్జయిని మహకాళేశ్వర్‌ దేవాలయం, 5. గోవాలోని చర్చ్‌ అండ్‌ కాన్వెంట్‌ ఆఫ్‌ సెయింట్‌ ఫ్రాన్సిస్‌ ఆఫ్‌ ఎస్సిస్సి, 6. ఎర్నాకులంలోని ఆదిశంకరాచార్య కాలడి, 7. శ్రావణబెలగోలలోని గోమఠేశ్వర క్షేత్రం, 8. దేవ్‌గఢ్‌లోని బైద్యనాథ్‌ జ్యోతిర్లింగ ఆలయం (జార్ఖండ్), 9. బిహార్‌లోని గయాతీర్థ్‌, 10. గుజరాత్‌లోని సోమనాథ్‌ మందిరం