పెళ్లి కావడంలేదని పక్కింటి అమ్మాయిని చంపాడు... - MicTv.in - Telugu News
mictv telugu

పెళ్లి కావడంలేదని పక్కింటి అమ్మాయిని చంపాడు…

April 3, 2018

అత్త మీద కోపం దుత్త మీద చూపించాడు ఓ యువకుడు. తనకు  12 సార్లు పెళ్లిచూపులు జరిగినా తనకు పెళ్లి జరగడం లేదని, పక్కింటి అమ్మాయిని దారుణంగా హత్య చేశాడు.ఈ ఘటన ఛత్తీస్‌గడ్ రాజధాని రాయ్‌పూర్‌లో జరిగింది. రాయ్‌పూర్‌కు చెందిన పింటు  బీఏ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. గత కొన్ని రోజుల నుంచి పింటు పెళ్లి కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాడు. 12 సార్లు పెళ్లి చూపులకు వెళ్లాడు. కానీ అతనిని ఒక్క అమ్మాయి కూడా పెళ్లి చేసుకోవడానికి సమ్మతించలేదు.దీంతో డిప్రెషన్‌కు గురైన పింటు ,తనకు పెళ్లి కాకపోవడానికి కారణం తన పక్కింట్లో ఉన్న అమోరికా పటేల్ అనే యువతి అని భావించాడు. తనకు పెళ్లి కాకుండా  చేతబడి చేయిస్తోందని ఆమెపై కోపం పెంచుకున్నాడు. దీంతో ఆమె ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి చున్నితో గొంతు నులిమి హత్య చేశాడు. ఆ తర్వాత పారిపోతుండగా చుట్టుపక్కల వారు పింటూను పట్టుకుని దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.