చికెన్‌తో కేన్సర్‌కు చెక్ 

జపాన్ శాస్త్రవేత్తలు కోడిమాంస సుగుణాలపై ప్రయోగాలు చేస్తున్నారు. AIST ( నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ ఇండస్ట్రియల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ) కి చెందిన శాస్త్రవేత్తలు తమ ప్రయోగాలకు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. కోడి మాంసం తినడం వల్ల కేన్సర్  కు చెక్ పెట్టొచ్చని తెలిపారు. వీరి ప్రయోగాల్లో భాగంగా… ఇంటర్ ఫెరోన్ అనే వ్యాక్సిన్‌ను కోళ్ళకు ఇంజెక్ట్ చేశారు.. ఇలా చేయడం వల్ల కోడి రోజుకు రెండు నుండి మూడు గుడ్లు పెడుతుంది.  ఈ కోళ్ళ మాంసం, గుడ్లను తినడం వల్ల ేన్సర్ వంటి ప్రమాదకర రోగాలను జయించవచ్చంటున్నారు. ఇలా ఉత్పత్తి అయిన మాంసం, గుడ్లలో కేన్సర్, డయాబెటిస్,  హృద్రోగాలతో పోరాడే శక్తి వుంటుందట. త్వరలోనే మార్కెట్లోకి ఈ రకం కోళ్ళు, గుడ్లు రానున్నాయంటున్నారు పరిశోధకులు.

SHARE