టీటీడీలో అక్రమాలకు చెక్… ఒక మెయిల్‌ ఐడీ, ఒక ఫోన్‌ నెంబరుతోనే సేవా టికెట్లు... - MicTv.in - Telugu News
mictv telugu

టీటీడీలో అక్రమాలకు చెక్… ఒక మెయిల్‌ ఐడీ, ఒక ఫోన్‌ నెంబరుతోనే సేవా టికెట్లు…

November 3, 2018

తిరుమలలో అక్రమార్కుల ఆటలు ఇక సాగవు. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఆటంకాలు జరగకుండా చూసుకోవాలని తిరుమల దేవస్థానం తగు జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ క్రమంలో తిరుమలలో ప్లాస్టిక్ నిషేధం నవంబరు 2 నుంచి అమల్లోకి వచ్చిన విషయం తెల్సిందే. దీన్ని ఎవరైనా ఉల్లంఘిస్తే రూ.5 వేల నుంచి రూ.25 వేల వరకు జరిమానా విధిస్తామని తెలిపింది. ఇదిలా వుండగా టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. వందలాది నకిలీ ఐడీలతో పేరు నమోదు చేసుకోవడం, ఎలక్ట్రానిక్‌ లాటరీ విధానంలో సేవా టిక్కెట్లు దక్కించుకుని, వాటిని ఇతరులకు అమ్ముకొని సొమ్ము చేసుకోవడానికి టీటీడీ చెక్ పెట్టింది. పాత విధానంలో కీలక మార్పులు తీసుకువచ్చింది.Telugu news Check for illegal ttd’s ... Service Tickets with a mail id, a phone number …కొత్త విధానం గురించి టీటీడీ ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ వెల్లడించారు. ‘విజిలెన్స్‌ విభాగం సిఫార్సుల మేరకు రూపొందించిన తాజా నిబంధనలు నవంబర్‌ నెలలో విడుదల చేసిన సేవా టికెట్లకు వర్తింపజేశాం. ఫిబ్రవరి నెలకు సంబంధించిన శ్రీవారి వివిధ ఆర్జిత సేవలకు 67,146 టికెట్లను విడుదల చేశాం. కొత్త నిబంధన ప్రకారం.. ఒక మెయిల్‌ ఐడీ, ఒక ఫోన్‌ నెంబరుతో మాత్రమే బుక్‌ చేసుకోవాలి’ అని పేర్కొన్నారు.

కల్యాణోత్సవం, ప్రత్యేక దర్శనం, సహస్రదీపాలంకరణ సేవా టిక్కెట్లను ఆన్‌లైన్‌లో నేరుగా పొందవచ్చని తెలిపారు. తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు డిసెంబరు 4 నుంచి 12 వరకు నిర్వహించనున్నారు.