నోట్ల రద్దుతో సాధించలేంది,చెక్కుబుక్కులను రద్దు చేసి సాధిస్తారట - MicTv.in - Telugu News
mictv telugu

నోట్ల రద్దుతో సాధించలేంది,చెక్కుబుక్కులను రద్దు చేసి సాధిస్తారట

November 21, 2017

ఇక చెక్కుబుక్కులకు కాలం చెల్లిందా? భారత ఆర్థిక వ్యవస్థను గాడిలో పడేయాలంటే చెక్కుల ద్వారా జరిగే లావాదేవీలను అడ్డుకోవల్సిందేనా? చెక్కులను నిషేదించాలని మోడీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుందా? కేంద్ర ప్రభుత్వ ఆర్థిక శాఖను కదలికలను గమనిస్తే అవుననే అనిపిస్తుంది. అయితే చెక్కుల ద్వారా జరిగే లావాదేవీలపై నిషేదం ఎప్పటినుంచి అమలు చేస్తారో అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది.

నోట్లను రద్దు చేసి సంవత్సరం అయ్యింది. భారత్ ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని డిజిటల్ మోడ్‌లోకి మార్చాలనే ప్రయత్నానికి సంవత్సర కాలం. మోడీ తీసుకున్న నిర్ణయాల్లో అత్యంత వివాదాస్పద నిర్ణయంగా నోట్ల రద్దు నిలిచింది. 500, 1000 నోట్లను నిషేదించి నగదు బదిలీలను అడ్డుకోవాలని అనుకుంది మోడీ సర్కార్. అయితే ఈ నిర్ణయం పెద్దగా ఫలితం ఇవ్వలేదు. నగదు చలామణిని ఆపి, డిజిటల్ లావాదేవీలను పెంచాలంటే  నోట్లను ప్రజలకు దూరం చెయ్యడమే ఏకైక మార్గంగా ఆర్ధిక నిపుణులు భావిస్తున్నారు. అందులో భాగంగా చెక్కులను నిషేదించాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది.

అయితే ఈ వాదనను దృవీకరరిస్తూ  కాన్ఫడరేషన్ ఆప్ ఆలిండియా ట్రేడర్స్  (CAIT) ఓ ప్రకటన చేసింది. కొద్దిరోజుల్లోనే చెక్కుబుక్కులను  కేంద్ర ప్రభుత్వం నిషేదించే అవకాశమున్నట్లు  సిఎఐటీ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్ అన్నట్టు తెలుస్తోంది.  

కొత్త నోట్ల ప్రింటింగ్ కోసం 25000  కోట్ల రూపాలయలను, దానితో పాటే వాటి రక్షణకు, రవాణాకు గానూ మరో 6000 కోట్లు ఖర్చవుతున్నట్లు ఆయన తెలిపారు.  నోట్ల వాడకాన్ని తగ్గించి డిజిటల్ లావాదేవీల వైపు ప్రజలను తీసుకుపోతే మంచి ఫలితాలు ఉంటాయన్నది ఆయన అభిప్రాయం.  సో అతి త్వరలో మనం చెక్కు బుక్కుల రద్దును కూడా చూడబోతున్నాం.